Congress: కాంగ్రెస్ పార్టీ వరస వైఫల్యాలపై ఆవేదన చెందిన ఒడిశాకు చెందిన మాజీ కాంగ్రెస్ ఎమ్మెల్యే సోనియా గాంధీకి సంచలన లేఖ రాశారు. కాంగ్రెస్‌కు చాలా సంస్కరణలు అవసమని ఆయన చెప్పారు. బారాబతి-కటక్ మాజీ ఎమ్మెల్యే మహమ్మద్ మొక్విమ్ డిసెంబర్ 8న సోనియా గాంధీకి ఐదు పేజీల లేఖ పంపారు. లోక్‌సభ ఎన్నికల్లో హ్యాట్రిక్ ఓటములు, 2024 నుంచి బీహార్, ఢిల్లీ, హర్యానా, మహారాష్ట్ర, జమ్మూ కాశ్మీర్, ఒడిశా పరాజయాలను ఆయన ప్రస్తావించారు.
Read Also: Tej Pratap Yadav: పశ్చిమ బెంగాల్, యూపీ అసెంబ్లీ ఎన్నికల బరిలో జనశక్తి జనతాదళ్..
రాహుల్ గాంధీని కలిసేందుకు మూడేళ్లుగా ప్రయత్నిస్తున్నా, అనుమతి లభించడం లేదని చెప్పారు. ఇది తన వ్యక్తిగత ఫిర్యాదు కాదని, భారతదేశం అంతటా కార్యకర్తలు ఇలాగే భావిస్తున్నారని అన్నారు. పార్టీకి యువత, కార్యకర్తలతో పెరుగుతున్న అంతరాయాన్ని మొక్విమ్ హైలెట్ చేశారు. శశిథరూర్, డీకే శివకుమార్, సచిన్ పైటల్, ప్రియాంకాగాంధీ వంటి నేతలు భవిష్యత్తులో పార్టీకి ప్రధాన నాయకత్వంగా నిలవాలని సూచించారు. మల్లికార్జుణ ఖర్గే కాంగ్రెస్ అధ్యక్షుడైన తర్వాత ఆయన యువతతో కలవలేకపోతున్నారని అన్నారు. మనం ఇప్పుడు మేల్కొనకపోతే, మనం వారసత్వంగా పొందిన కాంగ్రెస్ పార్టీని కోల్పోయే ప్రమాదం ఉందని హెచ్చరించారు.
జ్యోతిరాధిత్య సింధియా, హిమంత బిశ్వ సర్మ వంటి యువ నేతల్ని కాంగ్రెస్ కోల్పోయిన విషయాన్ని గుర్తు చేశారు. సింధియా పార్టీ మార్పు మధ్యప్రదేశ్‌లో ప్రభుత్వాన్ని కూల్చివేసిందని, హిమంత ఈశాన్య రాష్ట్రాల్లో బీజేపీ పట్టును పెంచి, కాంగ్రెస్‌ను దాదాపుగా తుడిచివేశాడని చెప్పారు. శతాబ్ధాల నాటి వారసత్వం చేజారిపోతోందని, ఇతరుల చేతిలో ఓటమి కన్నా, సొంతింటి నిర్ణయాల వల్లే ఇలా జరుగుతోందని హెచ్చరించారు.
