Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
  • English
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home National News 5g Spectrum Auction Today

5G Spectrum: 5జీ స్పెక్ట్రం వేలానికి వేళాయె. మరికొద్దిసేపట్లోనే ప్రారంభం.

Published Date :July 26, 2022 , 7:56 am
By Akkirala Kondala Rao
5G Spectrum: 5జీ స్పెక్ట్రం వేలానికి వేళాయె. మరికొద్దిసేపట్లోనే ప్రారంభం.
  • Follow Us :
  • google news
  • dailyhunt

5G Spectrum: టెలీకమ్యూనికేషన్స్‌ రంగంలో ఐదో తరం తరంగాల సేవలకు నేడు మరో అడుగు ముందుకు పడనుంది. 5జీ స్పెక్ట్రం వేలానికి వేళయింది. ఈ ప్రక్రియ మరికొద్దిసేపట్లో ప్రారంభం కానుంది. ఉదయం 10 గంటలకు ఆరంభంకానున్న ఈ వేలం ఇవాళ సాయంత్రం 6 గంటల వరకు కొనసాగనుంది. వివిధ సంస్థలు తమ అవసరానికి తగిన ఫ్రీక్వెన్సీ కోసం బిడ్లను దాఖలు చేస్తాయి. ఫ్రీక్వెన్సీ ఆధారంగా మొత్తం 9 బ్యాండ్లను వేలానికి అందుబాటులో ఉంచారు. అన్ని బ్యాండ్లలోనూ కలిపి మొత్తం 72 గిగా హెర్ట్‌జ్‌ల స్పెక్ట్రాన్ని విక్రయిస్తారు.

వేలంలో సొంతం చేసుకునే స్పెక్ట్రాన్ని 20 ఏళ్ల పాటు వాడుకోవచ్చు. ప్రభుత్వానికి తిరిగి ఇచ్చేయాలనుకుంటే కనీసం పదేళ్లు ఆగాలి. ప్రస్తుతం మనం వాడే స్మార్ట్‌ ఫోన్లు 4జీ స్పెక్ట్రం ఆధారంగా పనిచేస్తున్నాయి. ఇంతకన్నా పది రెట్లు వేగంగా పనిచేయటానికి 5జీ స్పెక్ట్రం వీలు కల్పిస్తుంది. ఈ స్పెక్ట్రమ్‌ కోసం ప్రధానంగా రిలయెన్స్‌ జియో, భారతీ ఎయిర్‌టెల్‌, వొడాఫోన్‌-ఐడియా, అదానీ ఎంటర్‌ప్రైజెస్‌ పాల్గొంటున్నాయి. 5జీ స్పెక్ట్రం వేలం ఇవాళ, రేపు రెండు రోజులు పడుతుందని చెబుతున్నారు.

Also Read

  • Marriage: ‘నాకు 67 ఏళ్లు.. నా పెళ్లి కచ్చితంగా జరుగుతుంది’.. సినీ హీరో సంచలన వ్యాఖ్యలు..
  • AI Viral Story: సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ నుంచి వెయిటర్‌‌గా.. ఏఐ దెబ్బకు తలకిందులైన జీవితం..
  • West Bengal Elections: మమతా బెనర్జీ నియోజకవర్గంలో మరో గందరగోళం..
  • Vijay TVK Plan B: రేపు ఫలితాలు.. విజయ్ 'ప్లాన్-బి' రెడీ.. అభ్యర్థులకు దళపతి సీరియస్ వార్నింగ్!

read also: TJ Gnanavel: ‘జై భీమ్’ డైరెక్టర్ కొత్త సినిమా.. ఈసారి భర్తను చంపినవాడిపై భార్య న్యాయపోరాటం

టెలికం సంస్థలే కాకుండా టెక్నాలజీ కంపెనీలు కూడా తమ సొంత అవసరాల (నెట్‌వర్క్‌) కోసం స్పెక్ట్రమ్‌ని వాడుకునేందుకు పర్మిషన్‌ ఇవ్వటం ఈ వేలం ప్రత్యేకత అని నిపుణులు చెబుతున్నారు. స్పెక్ట్రం కనీస విలువ దాదాపు 4.3 లక్షల కోట్లు అని అధికారులు పేర్కొంటున్నారు. ఈ వేలం ద్వారా కేంద్ర ప్రభుత్వానికి లక్ష కోట్ల రూపాయలకు పైగా ఆదాయం సమకూరనుందని అంచనా వేస్తున్నారు. వేలం పూర్తయ్యాక 5జీ సేవలు వచ్చే నెల(ఆగస్టు)లో గానీ ఆపైవచ్చే నెల(సెప్టెంబర్‌)లో గానీ అందుబాటులోకి రానున్నాయని అంటున్నారు. టెలీకమ్యూనికేషన్లతోపాటు వివిధ రకాల వైర్‌లెస్‌ ఇంటర్నెట్‌ సర్వీసులకు స్పెక్ట్రం అవసరం.

ఈ స్పెక్ట్రాన్ని తక్కువ ఫ్రీక్వెన్సీ నుంచి అధిక ఫ్రీక్వెన్సీ వరకు వివిధ బ్యాండ్లలో విభజిస్తారు. ఎక్కువ ఫ్రీక్వెన్సీ కలిగిన తరంగాలు ఎక్కువ డేటాను ఎక్కువ వేగంతో మోసుకెళ్తాయి. తక్కువ ఫ్రీక్వెన్సీ గల తరంగాలకి కవరేజీ ఎక్కువ ఉంటుంది. గానీ వేగం తక్కువ. 2జీ నెట్‌వర్క్‌లో 900, 1800 మెగా హెర్ట్‌జ్‌ బ్యాండ్‌లను వాడతారు. 3జీలో 900, 2100 మెగా హెర్ట్‌జ్‌ బ్యాండలను వినియోగించుకుంటారు. 4జీలో 850, 1800, 2300, 2500 మెగా హెర్ట్‌జ్‌ తరంగాలను ఉపయోగిస్తారు. ఇప్పుడు 5జీలో తక్కువ శ్రేణి, మధ్య శ్రేణి, అధిక శ్రేణి ఫ్రీక్వెన్సీ బ్యాండ్లు వేలానికి అందుబాటులో ఉన్నాయి.

తక్కువ శ్రేణిలో 600, 700, 800, 900, 1800, 2300 మెగా హెర్ట్‌జ్‌; మధ్య శ్రేణిలో 3.3 గిగా హెర్ట్‌జ్‌, అధిక ఫ్రీక్వెన్సీ బ్యాండ్‌లో 26 గిగా హెర్ట్‌జ్‌ స్పెక్ట్రాలను వేలం వేయనున్నారు. 600, 700 మెగా హెర్ట్‌జ్‌, 3.3 గిగా హెర్ట్‌జ్‌, 26 గిగా హెర్ట్‌జ్‌ బ్యాండ్లను తొలిసారిగా వేలం వేస్తున్నారు. జియో 800 మెగా హెర్ట్‌జ్‌, ఎయిర్‌టెల్‌-వీఐలు 900 మెగా హెర్ట్‌జ్‌ బ్యాండ్‌లో స్పెక్ట్రమ్‌ను కొనుగోలు చేయొచ్చని అనుకుంటున్నారు. 1800 మెగా హెర్ట్‌జ్‌ కోసం మూడు కంపెనీలూ పోటీపడే సూచనలున్నాయి.

5జీ సర్వీసులకి 3.3 గిగా హెర్ట్‌జ్‌, 26 గిగా హెర్ట్‌జ్‌ స్పెక్ట్రం కీలకం. వీటిని సీ బ్యాండ్‌, ఎంఎం వేవ్‌గా పేర్కొంటారు. ఎంఎం వేవ్‌ తక్కువ రేటుకే లభిస్తుంది. సీ బ్యాండ్‌ రేట్‌ ఎక్కువ. 5జీ స్పెక్ట్రం కోసం కంపల్సరీగా అడ్వాన్స్‌ పేమెంట్‌ చేయాలనే రూలేం లేదు. 20 వాయిదాల్లో చెల్లించే వీలు కల్పించారు. ప్రతి సంవత్సరం ప్రారంభంలో కడితే సరిపోతుంది. స్పెక్ట్రం యుటిలిటీకీ ఛార్జ్‌ ఇవ్వాల్సిన పనిలేదు. మరికొద్ది సేపట్లో ప్రారంభం కానున్న 5జీ స్పెక్ట్రం వేలంపై దేశవ్యాప్తంగా ఆసక్తి నెలకొంది.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • 5g spectrum
  • auction today
  • bharti airtel
  • reliance gio
  • vodafone idea

తాజావార్తలు

  • Marriage: ‘నాకు 67 ఏళ్లు.. నా పెళ్లి కచ్చితంగా జరుగుతుంది’.. సినీ హీరో సంచలన వ్యాఖ్యలు..

  • PV Sindhu : మ్యాజిక్ డ్రెయిన్స్‌తో పల్లెల్లో సరికొత్త విప్లవం

  • Dacoit OTT Release Date: అడివి శేష్‌ ‘డెకాయిట్’ OTT రిలీజ్ డేట్ ఫిక్స్.. ఎక్కడ, ఎప్పుడు స్ట్రీమింగ్ అంటే?

  • KKR Vs SRH: పెవిలియన్‌కు క్యూ కట్టిన కాటేరమ్మ కొడుకులు.. పట్టుబిగించిన కేకేఆర్..

  • AI Viral Story: సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ నుంచి వెయిటర్‌‌గా.. ఏఐ దెబ్బకు తలకిందులైన జీవితం..

ట్రెండింగ్‌

  • 3.4K డిస్‌ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!

  • స్టైలిష్ కలర్స్‌తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?

  • స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!

  • Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!

  • Happy Birthday Rohit Sharma: రికార్డుల రారాజు.. ‘హిట్‌ మ్యాన్’ రోహిత్ శర్మకు పుట్టినరోజు శుభాకంక్షలు.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions