Site icon NTV Telugu

Heat Waves: తీవ్రమైన వేడిగాలులు.. ఇప్పటి వరకూ 54 మంది మృతి

Heat Wave

Heat Wave

భారతదేశంలో ఎండలు దడపుట్టిస్తున్నాయి. 45 డిగ్రీల సెల్సియస్ కంటే ఎక్కువ గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఈ క్రమంలో.. ఢిల్లీతో సహా పలు చోట్ల మధ్య, తూర్పు మరియు ఉత్తర భారతదేశంలో తీవ్రమైన వేడిగాలులు వీస్తున్నాయి. దీంతో.. 54 మంది మృతి చెందారు. మే 31 నుంచి జూన్ 1 వరకు ఉత్తరప్రదేశ్‌, హర్యానా, చండీగఢ్, ఢిల్లీలో తీవ్ర వడగాల్పులు వీస్తాయని అంచనా వేశారు. భారత వాతావరణ శాఖ (IMD) ప్రకారం.. మే 31 నుంచి జూన్ 2 మధ్య వాయువ్య భారతదేశంలోని మైదానాలలో ఉరుములు మరియు మెరుపులతో కూడిన అతి తక్కువ/తేలికపాటి వర్షపాతం నమోదవుతుందని అంచనా వేశారు. గురువారం.. ఢిల్లీలో గరిష్ట ఉష్ణోగ్రత 45.6 డిగ్రీల సెల్సియస్, సాధారణం కంటే 5.2 డిగ్రీలు ఎక్కువగా నమోదైంది.

తీవ్రమైన వడగాలుల కారణంగా బీహార్‌లో 32 మంది వడదెబ్బతో మరణించారు. అందులో ఔరంగాబాద్‌కు చెందిన 17 మంది, అర్రాలో ఆరుగురు, గయాలో ఒక్కరు, రోహతాస్‌లో ముగ్గురు, బక్సర్‌లో ఇద్దరు, పాట్నాలో ఒకరు మృతిచెందారు. అటు.. ఒడిశాలోని రూర్కెలాలో 10 మంది చనిపోయారు. జార్ఖండ్‌లోని పాలము, రాజస్థాన్‌లలో ఐదుగురు మరణించగా, ఉత్తరప్రదేశ్‌లోని సుల్తాన్‌పూర్‌లో ఒకరు మరణించారు. గురువారం.. రాజస్థాన్, హర్యానా, చండీగఢ్, ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, బీహార్, జార్ఖండ్, ఒడిశా, తూర్పు మధ్యప్రదేశ్ మరియు విదర్భలోని అనేక ప్రాంతాలలో గరిష్ట ఉష్ణోగ్రతలు 45 నుంచి 48 డిగ్రీల సెల్సియస్‌లో నమోదైందని వాతావరణ శాఖ తెలిపింది.

Read Also: Hyderabad: సాఫ్ట్ వేర్ ఇంజనీర్ అఖిల కేసులో ప్రియుడు అరెస్ట్.. వెలుగులోకి సంచలన విషయాలు

పశ్చిమ మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, కోస్తాంధ్ర, యానాం, గుజరాత్, తెలంగాణ, రాయలసీమల్లోని అనేక ప్రాంతాల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు 42 నుంచి 45 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఇవి వాయువ్య భారతదేశంలోని అనేక ప్రాంతాలలో మధ్య మరియు తూర్పు భారతదేశంలోని ఏకాంత ప్రాంతాలలో సాధారణం కంటే 3 నుంచి 6 డిగ్రీల ఉష్ణోగ్రత ఎక్కువగా నమోదైంది. IMD ప్రకారం.. మే 31, జూన్ 1 తేదీలలో పంజాబ్, హర్యానా, చండీగఢ్, ఢిల్లీ, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, బీహార్, జార్ఖండ్ మరియు ఒడిశాలోని ఏకాంత ప్రదేశాలలో వడగాలులు తీవ్రమైన వడగాలులు వీచే అవకాశం ఉందని తెలిపింది. మే 31, జూన్ 1 న పంజాబ్, హర్యానా, చండీగఢ్, ఢిల్లీ, బీహార్ మరియు ఒడిశా, ఉత్తరప్రదేశ్‌లో రాత్రులు వేడిగా ఉంటాయని వాతావరణ శాఖ తెలిపింది.

నైరుతి రుతుపవనాలు లక్షద్వీప్, కేరళలోని మరికొన్ని ప్రాంతాలు, కర్ణాటకలోని కొన్ని ప్రాంతాలు, తమిళనాడులోని మరికొన్ని ప్రాంతాలు, అస్సాం మరియు మేఘాలయలోని మిగిలిన ప్రాంతాలు, ఉప-హిమాలయ పశ్చిమ బెంగాల్‌లోని కొన్ని ప్రాంతాలలోకి రుతుపవనాలు రావడానికి పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని IMD తెలిపింది. మే 31 నుండి జమ్మూ-కశ్మీర్, లడఖ్, గిల్గిత్, బాల్టిస్తాన్, ముజఫరాబాద్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్‌లో ఉరుములు మరియు మెరుపులతో కూడిన అక్కడక్కడ తేలికపాటి వర్షాలు పడే అవకాశం ఉంది. గురువారం.. నైరుతి రుతుపవనాలు దాని షెడ్యూల్ ప్రారంభానికి ఒక రోజు ముందు కేరళలో ప్రారంభమయ్యాయి. ఈశాన్య భారతదేశంలోని చాలా ప్రాంతాలకు చేరుకున్నాయని వాతావరణ శాఖ తెలిపింది. మే 31 నాటికి కేరళలో రుతుపవనాలు ప్రారంభమవుతాయని గతంలో మే 15న వాతావరణ కేంద్రం ప్రకటించింది.

Exit mobile version