NTV Telugu Site icon

Haryana: ప్రొఫెసర్ లైంగిక వేధింపులపై ప్రధాని, సీఎంకి 500 మంది విద్యార్థినుల లేఖ

Ml Kattar

Ml Kattar

Haryana:హర్యానాలోని సిర్సాకు చెందిన 500 మంది ఉమెన్స్ కాలేజ్ విద్యార్థినులు, చౌదరి దేవీలాల్ యూనివర్సిటీకి చెందిన ప్రొఫెసర్ లైంగిక వేధింపులకు పాల్పడ్డారని ఫిర్యాదు చేస్తూ ప్రధాని నరేంద్రమోడీతో పాటు హర్యానా ముఖ్యమంత్రి మనోహర్ లాల్ కట్టర్‌కి లేఖ రాశారు. ప్రొఫెసర్‌ని విధుల నుంచి తొలగించడమే కాకుండా.. అతడిపై రిటైర్డ్ హైకోర్టు న్యాయమూర్తి నేతృత్వంలో విచారణ జరపాలని లేఖలో పేర్కొన్నారు.

లేఖ కాపీలను వైస్ ఛాన్సరల్ డాక్టర్ అజ్మీర్ సింగ్ మాలిక్, హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ, హర్యానా హోంమంత్రి అనిల్ విజ్, జాతీయ మహిళా కమిషనర్ చైర్‌పర్సన్ రేఖా శర్మతో పాటు రాష్ట్ర ప్రభుత్వ సీనియర్ అధికారులు, మీడియా సంస్థలకు పంపారు. ప్రొఫెసర్ అసభ్యకరమైన చర్యలపై ఆరోపించారు. ‘‘ప్రొఫెసర్ అమ్మాయిలను తన కార్యాలయాలకు పిలిచి, వారిని బాత్రూమ్‌లోకి తీసుకెళ్తాడు, ప్రైవేట్ భాగాలను తాకుతాడు. మాతో అసభ్యకరమైన పనులు చేస్తారు. తాము నిరసన తెలిపితే, పరిణామాలు దారుణంగా ఉంటాయని బెదిరించాడు’’ అని అమ్మాయిలు లేఖలో పేర్కొన్నారు. ఇది గత కొన్ని నెలలుగా జరుగుతోందని వారు ఆరోపించారు.

Read Also: Lakshadweep: మాల్దీవ్స్ వివాదం నడుమ ఇంటర్నెట్‌లో దుమ్మురేపుతున్న “లక్షద్వీప్”.. 20 ఏళ్లలో ఇదే అధికం..

వైస్ ఛాన్సలర్ కూడా తమకు మద్దతు నిలవకుండా, తమను బహిష్కరిస్తామని బెదిరించాడని, నిందితుడైన ప్రొఫెసర్‌కి రాజకీయ పలుకుబడి ఉందని వైస్ ఛాన్సలర్ పట్టించుకోలేదని ఆరోపించారు. దీనిపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నరని, యూనివర్సిటీ కమిటీ కూడా ఈ ఆరోపణలను విచారిస్తుందని, ఇవి తీవ్రమైన ఆరోపణలని యూనివర్సిటీ రిజిస్ట్రార్ డాక్టర్ రాజేష్ కుమార్ బన్సాల్ అన్నారు. దోషిగా తేలితే చర్యలు తీసుకుంటామని, వారు తప్పించుకోలేరని రిజిస్టార్ చెప్పారు. దర్యాప్తు చేస్తున్నట్లు సిర్సా పోలీస్ అధికారి దీప్తి గార్గ్ వెల్లడించారు. ఆరోపణలను తీవ్రంగా తీసుకున్న సీఎం కట్టర్, అతని సెలవులను రద్దు చేయాలని ఆదేశించారు. గతంలో హర్యానా జింద్ జిల్లాలో ప్రభుత్వ పాఠశాలలో ప్రిన్సిపాల్ బాలికలపై లైంగిక వేధింపులకు పాల్పడినట్లు ఆరోపణలు వచ్చిన తర్వాత తాజాగా ఈ లేఖ వెలుగులోకి వచ్చింది.