NTV Telugu Site icon

Jammu Kashmir: జమ్మూ కాశ్మీర్‌లో ఎన్‌కౌంటర్.. నలుగురు ఆర్మీ జవాన్లకు గాయాలు..

Jammu Kashmir

Jammu Kashmir

Jammu Kashmir: జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల ముందు ఉగ్రవాదులు పేట్రేగిపోతున్నారు. వరసగా ఎన్‌కౌంటర్లు జరుగుతున్నాయి. తాజాగా కిష్ట్వార్ ప్రాంతంలో ఉగ్రవాదులు, భద్రతా సిబ్బందికి మధ్య కాల్పులు చోటు చేసుకున్నాయి. శుక్రవారం జరిగిన ఈ ఎన్‌కౌంటర్‌లో నలుగురు ఆర్మీ సిబ్బందికి గాయాలయ్యాయి. భద్రతా బలగాలు ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టాయని, ఉగ్రవాదుల కోసం వేట కొనసాగుతున్నట్లు ఇండియన్ ఆర్మీ ఒక ప్రకటనలో తెలిపింది. గాయపడిన నలుగురిలో ఒకరిని చికిత్స కోసం సమీపంలో కమాండ్ ఆస్పత్రికి తరలించగా, మరో ముగ్గురు స్థానికంగా చికిత్స పొందుతున్నారు.

Read Also: Teacher: 16 ఏళ్ల స్టూడెంట్‌తో లేడీ టీచర్ శృంగారం.. తండ్రికి తెలిసినా..

ఇంటెలిజెన్స్ ఇన్‌పుట్స్ ఆధారంగా శుక్రవారం తెల్లవారుజామున కిష్ట్వార్‌లోని చత్రూ ప్రాంతంలో ఆర్మీ, జమ్మూ కాశ్మీర్ పోలీసులు జాయింట్ ఆపరేషన్ చేపట్టారు. మధ్యాహ్నాం 3.30 గంటలకు ఉగ్రవాదుల తారసపడటంతో ఇరు వర్గాల మధ్య కాల్పులు జరిగాయి. తాజాగా కిష్ట్వార్‌లో జరిగిన ఎన్‌కౌంటర్‌లో పాల్గొన్న ఉగ్రవాదులే జూలై నెలలో దోడాలో జరిగిన ఎన్‌కౌంటర్‌తో సంబంధం కలిగి ఉన్నారని తెలిసింది. దోడా ఎన్‌కౌంటర్‌లో ఒక అధికారితో సహా నలుగురు సైనికులు మరణించారు. ఈ నెలలో జమ్మా కాశ్మీర్ అసెంబ్లీకి మూడు విడతల్లో ఎన్నికలు ప్రారంభం కానున్నాయి. 10 ఏళ్ల తర్వాత, ఆర్టికల్ 370 రద్దు తర్వాత తొలిసారిగా ఎన్నికలు జరగబోతున్నాయి.

అంతకుముందు బుధవారం కథువా-ఉదంపూర్ సరిహద్దులోని బసంత్ గఢ్‌లో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు. ఈ ప్రాంతంలో ఉగ్రవాదుల ఉనికి గురించి సమాచారం అందుకున్న పారామిలటరీ దళాలు మరియు పోలీసు సిబ్బంది బసంత్‌గఢ్‌కు చేరుకుని ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టారు. జమ్మూలోని అఖ్నూర్ సెక్టార్‌లోని నియంత్రణ రేఖ (ఎల్‌ఓసి) వెంబడి పాకిస్తాన్ రేంజర్లు అకారణంగా కాల్పులు జరపడంతో సరిహద్దు భద్రతా దళం (బిఎస్‌ఎఫ్) సిబ్బంది గాయపడిన కొద్ది గంటల తర్వాత ఈ ఎన్‌కౌంటర్ జరిగింది.