NTV Telugu Site icon

JK Encounter: ఉదంపూర్‌లో ఎన్‌కౌంటర్.. ముగ్గురు ఉగ్రవాదులు హతం

Jkencounter

Jkencounter

జమ్మూకాశ్మీర్‌లోని ఉదంపూర్‌లో భద్రతా బలగాలు-ఉగ్రవాదుల మధ్య ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి. ఈ ఎన్‌కౌంటర్‌లో ముగ్గురు ఉగ్రవాదులు హతమయ్యారు. ఆర్మీ ప్రత్యేక బలగాలు, జమ్మూ కాశ్మీర్ పోలీసులు బుధవారం కథువా జిల్లాలో జరిపిన ఆపరేషన్‌లో ముగ్గురు టెర్రరిస్టులను కాల్చిచంపారు. ఆపరేషన్ కొనసాగుతోందని సంబంధిత వర్గాలు తెలిపాయి. దీనిపై మరింత సమాచారం రావాల్సి ఉంది.

ఇది కూడా చదవండి: Crime: పాత బాయ్ ఫ్రెండ్ తిరిగి రావడంతో.. కొత్త స్నేహితుడైన ఎస్సైని హత్య చేసిన మహిళా కానిస్టేబుల్..

ఇద్దరు ఉగ్రవాదుల మృతదేహాలు లభ్యమయ్యాయని పోలీస్ వర్గాలు తెలిపాయి. ప్రత్యేక బలగాలు ఈ ఆపరేషన్‌లో పాల్గొన్నాయని పేర్కొన్నారు. ఇదిలా ఉంటే బుధవారం తెల్లవారుజామున జమ్మూ కాశ్మీర్‌లోని అఖ్నూర్ సెక్టార్‌లో పాక్ బలగాలు అకారణంగా జరిపిన కాల్పుల్లో సరిహద్దు భద్రతా దళం (బీఎస్‌ఎఫ్) సైనికుడు గాయపడ్డాడు. సైనికులు అప్రమత్తంగా ఉన్నారని భారత్-పాకిస్థాన్ అంతర్జాతీయ సరిహద్దులో కాపలా కాస్తున్న బీఎస్ఎఫ్ తెలిపింది. ఈ సరిహద్దు సుమారు 3,323 కి.మీ విస్తరించి ఉంది.

ఇది కూడా చదవండి: Ganesh Immersion: గణేష్ శోభాయాత్రలో త్రుటిలో తప్పిన ప్రమాదం

ఇదిలా ఉంటే జమ్మూకాశ్మీర్‌లో మూడు విడతల్లో పోలింగ్ జరగనుంది. సెప్టెంబర్ 18, 25, అక్టోబర్‌ 1న ఓటింగ్ జరగనుంది. ఎన్నికల ఫలితాలు మాత్రం అక్టోబర్ 8న వెలువడనున్నాయి. అన్ని పార్టీలు ఎన్నికల ప్రచారాన్ని మొదలుపెట్టాయి.

ఇది కూడా చదవండి: Crime: పాత బాయ్ ఫ్రెండ్ తిరిగి రావడంతో.. కొత్త స్నేహితుడైన ఎస్సైని హత్య చేసిన మహిళా కానిస్టేబుల్..

Show comments