NTV Telugu Site icon

Building Collapses: ముంబైలో కూలిన మూడు అంతస్థుల భవనం.. శిథిలాల కింద పలువురు..!

Mumbai

Mumbai

Building Collapses: మహారాష్ట్ర రాజధాని నవీ ముంబైలోని షాబాజ్ గ్రామంలో ఇవాళ (శనివారం) మూడు అంతస్తుల భవనం కుప్పకూలిపోయింది. శిథిలాల కింద చిక్కుకున్న వారిని రక్షించేందుకు పోలీసులు, అగ్నిమాపక దళం, జాతీయ విపత్తు ప్రతిస్పందన దళం (NDRF) బృందాలు సహాయక చర్యలు కొనసాగిస్తున్నాయి. నవీ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ కైలాస్ షిండే మీడియాతో మాట్లాడుతూ.. ఈ రోజు ఉదయం దాదాపు 5 గంటలకు భవనం కుప్పకూలిందని సమాచారం వచ్చింది.. ఈ భవనంలో 24 కుటుంబాలు నివాసం ఉంటున్నాయి.. ఈ ప్రమాదం నుంచి ఇద్దరు వ్యక్తులను రక్షించాం, ఇంకా చాలా మంది శిథిలాల కింద చిక్కుకుపోయినట్లు తెలుస్తుందన్నారు. అలాగే, నవీ ముంబై డిప్యూటీ అగ్నిమాపక అధికారి పురుషోత్తం జాదవ్ మీడియాతో మాట్లాడుతూ.. ఇక, ఉదయం 4.50 గంటలకు భవనం కుప్పకూలినట్లు మాకు కాల్ వచ్చింది అని వెల్లడించారు. శిథిలాల కింద చిక్కుకుపోయిన వారిని రక్షించడానికి రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతుందని పేర్కొన్నారు.

Read Also: Madanapalle Sub Collector Office Case: మదనపల్లె సబ్ కలెక్టరేట్‌ ఘటనలో కీలక పరిణామం..

అయితే, భారత వాతావరణ శాఖ (IMD) మహారాష్ట్రలోని రాయగడ, రత్నగిరి, సింధుదుర్గ్, పూణే, సతారా జిల్లాలకు నేడు (శనివారం) ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. దీంతో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని సూచించారు. దాదాపు రెండు రోజుల తర్వాత ముంబైలో పెద్దగా వర్షం పడలేదు.. అలాగే, థానే జిల్లాకు ఎల్లో హెచ్చరికలు జారీ చేయగా.. చంద్రాపూర్, గోండియా, గడ్చిరోలి జిల్లాలకు ఐఎండీ ఆరెంజ్ అలర్ట్ జారీ చేయబడింది. జూలై 28 నుంచి 30 వరకు మహారాష్ట్రలోని ఏ జిల్లాలోనూ ఆరెంజ్ అలర్ట్ లేదని భారత వాతవరణ శాఖ తెలిపింది.