Site icon NTV Telugu

Crime In Delhi: ఢిల్లీలో 24 గంటల్లోనే 3 హత్యలు.. శాంతిభద్రతలపై ఆప్ ఆగ్రహం..

Delhi

Delhi

Crime In Delhi: దేశ రాజధాని ఢిల్లీలో గురువారం నాడు మూడు హత్యలు జరిగాయి. రాష్ట్రంలో శాంతిభద్రతలపై బీజేపీ ప్రభుత్వంపై ఆమ్ ఆద్మీ పార్టీ తీవ్రంగా మండిపడింది. అయితే, సెంట్రల్ ఢిల్లీలోని నబీ కరీం ప్రాంతంలో జరిగిన చిన్న రోడ్డు ప్రమాదం తీవ్ర వాగ్వాదానికి దారి తీయడంతో మహేంద్ర అనే వ్యక్తిని లక్కీ, సాగర్ అనే ఇద్దరు సోదరులు కలిసి స్క్రూ డ్రైవర్‌తో కొట్టి చంపేశారు. వీరు ఇద్దరు ప్రస్తుతం పరారీలో ఉన్నారు.

Read Also: Russia-Ukraine: శాంతి ఒప్పందంపై అమెరికా సంచలన ప్రకటన

అలాగే, సెంట్రల్ ఢిల్లీలోని పంజాబీ బస్తీలో జరిగిన రెండవ సంఘటనలో ఆశిష్ ఆనంద్ అనే వ్యక్తిని ప్లాన్ ప్రకారం కొందరు దుండగులు వచ్చి కత్తితో పొడిచి చంపారు.. పోలీసులు ఇద్దరు నిందితులను అరెస్టు చేయగా.. మిగతా వారి కోసం గాలిస్తున్నారు. ఇక, మూడో ఘటన ఈశాన్య ఢిల్లీలోని సీలంపూర్‌లో చోటు చేసుకుంది. 17 ఏళ్ల బాలుడు కునాల్‌ని కత్తితో పొడిచి చంపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేశాం.. నిందితులను గుర్తించి అరెస్టు చేయడానికి రెండు బృందాలను నియమించామని పోలీసులు తెలిపారు. ఇక, సీఎం రేఖాగుప్తా సైతం ఈ వరుస మర్డర్లపై స్పందించింది. ఈ ఘటనలో కమిషనర్ తో మాట్లాడినట్లు పేర్కొనింది.

Read Also: Kishan Reddy: తెలంగాణలో మజ్లిస్ జండా ఎగురేయాలని అనుకుంటుంది.. కేంద్రమంత్రి హాట్ కామెంట్స్

ఇక, ఢిల్లీలో శాంతిభద్రతల పరిస్థితిపై మాజీ ముఖ్యమంత్రి అతిషి స్పందించారు. ఈ సందర్భంగా సీలంపూర్ హత్య దేశ రాజధానిలో శాంతిభద్రతల ఎలా ఉన్నాయె తెలియజేస్తుందన్నారు. వరుస హత్యలు జరుగుతుంటే.. ఢిల్లీ పోలీసులు ఏం చేస్తున్నారు? అని ప్రశ్నించింది. భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత క్రమంగా నేరాలు పెరిగిపోతున్నాయని విమర్శలు గుప్పించింది. బీజేపీ పాలనలో శాంతిభద్రతలు మెరుగుపడటం లేదని ఆరోపించింది. తాము అధికారంలో ఉన్న పదేళ్లు శాంతియుత పరిస్థితులు ఉన్నాయని మాజీ సీఎం అతిషి తెలిపింది.

Exit mobile version