NTV Telugu Site icon

Nagpur: ప్రియురాలితో శృంగారం చేస్తూ చనిపోయిన 28 ఏళ్ల యువకుడు

Dead Body

Dead Body

మహారాష్ట్ర నాగ్‌పూర్‌ జిల్లాలోని సావ్నర్ అనే పట్టణంలో విషాదం చోటు చేసుకుంది. ప్రియురాలితో శృంగారం చేస్తూ అజయ్(28) అనే యువకుడు ప్రాణాలు కోల్పోయాడు. ప్రియురాలితో ఎంజాయ్ చేసేందుకు ఆమెతో కలిసి లాడ్జికి వెళ్లిన అతడు.. సెక్స్ చేస్తూ ఉన్నట్టుండి కుప్పకూలిపోయాడు. దీంతో ప్రియురాలు లాడ్జీ సిబ్బందికి సమాచారం ఇచ్చింది. అయితే అప్పటికే అజయ్ చనిపోయినట్లు లాడ్జీ సిబ్బంది తెలిపారు. ఆస్పత్రికి తీసుకెళ్లగా పోస్టుమార్టం చేసిన డాక్టర్లు కార్డియాక్ అరెస్ట్ అంటే గుండె సంబంధిత సమస్యతో చనిపోయినట్లు నిర్ధారించారు.

Read Also: వర్షాకాలంలో ఈ జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోండి

అసలు వివరాల్లోకి వెళ్లే.. 28 ఏళ్ల అజయ్ అనే యువకుడు నర్సుగా పనిచేసే 21 ఏళ్ల యువతితో మూడేళ్లుగా రిలేషన్ షిప్‌లో ఉన్నాడు. త్వరలో వీరిద్దరూ పెళ్లి కూడా చేసుకోబోతున్నారు. ఈ నేపథ్యంలో ఆదివారం నాడు ప్రియురాలిని అజయ్ లాడ్జీకి తీసుకువెళ్లాడు. అద్దెకు ఓ రూమ్ తీసుకున్నాడు. ఆమెతో శృంగారం చేసేందుకు టాబ్లెట్లు కూడా వేసుకున్నాడు. ప్రియురాలితో శృంగారం చేస్తుండగా ఒక్కసారిగా అజయ్ కుప్పకూలి మృతి చెందాడు. పోలీసులు ఈ విషయం తెలుసుకుని విచారణ చేపట్టారు. మృతుడి జేబులో శృంగార సామర్థ్యాన్ని పెంచే సంబంధిత మాత్రలు దొరికాయని.. ఎక్కువసేపు శృంగారంలో పాల్గొనాలన్న ఉద్దేశ్యంతో టాబ్లెట్లు వేసుకోవడం వల్ల కలిగిన సైడ్ ఎఫెక్టుల కారణంగానే అతడు మృతి చెందినట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. కాగా తన ప్రియుడు తన కళ్ల ముందే మరణించడంతో యువతి కన్నీటి పర్యంతం అవుతోంది.

Show comments