Village Library: మారు మూల గ్రామంలో గ్రంధాలయం.. ఏడాదిలో 19 మందికి ప్రభుత్వ ఉద్యోగాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Gujarat: ఒక్కసారి తలదించి నన్ను చూస్తే జీవితంలో నిన్ను తలదించకుండా చేస్తాను అంటుంది పుస్తకం. తలరాతను మర్చి రాసుకోవాలి అంటే మంచిగా చదువుకోవాలి. కాని.. కొందరికి చదువుకోవాలి అని ఉన్న.. మౌలిక సదుపాయాలు లేక చదువుకోలేక పోతున్నారు. అయితే మనసుంటే మార్గం ఉటుంది. మనిషి తలచుకుంటే సాధించలేనిదంటూ ఏది లేదు. అని నిరూపించారు ఓ గ్రామీణ యువత. వివరాల లోకి వెళ్తే.. గుజరాత్ లోని దాహోద్ జిల్లా లోని పావ్‌డి గ్రామం.. మారుమూల గిరిజన ప్రాంతం కావడం చేత కనీస సదుపాయాలకు కూడా నోచుకోలేదు. అలా అని ఆ గ్రామ ప్రజలు నిరుత్సహ పడలేదు. మనం ఏం చెయ్యగలంలే అని ఊరుకోలేదు. రేపటి తరాల భవిష్యత్తును మార్చగల శక్తి కేవలం విద్యకే వుంది అని తెలుసుకున్న ఆ గ్రామ వాసులు ఓ అద్భుతమైన గ్రంథాలయాన్ని ఏర్పాటు చేసుకున్నారు.
Also Read
- karnataka: మంత్రులకు శాఖలు కేటాయింపు.. డీకే.శివకుమార్ దగ్గరే కీలక శాఖ
- Delhi: ఢిల్లీ ఎయిర్‌పోర్టులో కలకలం.. హైదరాబాద్ ప్రయాణికుడి బ్యాగ్‌లో కోతి పుర్రె..
- Retail Inflation: ఉల్లి-వెల్లుల్లి ధరల మంట.. 4.45%కి చేరిన రిటైల్ ద్రవ్యోల్బణం
- Parliament Monsoon Session: భయపడొద్దు, పారిపోవద్దు.. అమిత్ షా వస్తున్నాడు..
విద్యార్థులకు తమ వంతు సహాయ సహకారాలు అందించాలని 2017 లో గ్రామస్తులంతా కలిసి ఈ గ్రంథాలయాన్ని నిర్మించుకున్నారు. కాగా కేవలం ఈ గ్రంధాలయం కోసమే 2018 లో ఓ ఇంటిని కేటాయించారు. కాగా ఈ గ్రంథాలయాన్ని విద్యార్థులు ఎంతో చక్కగా వినియోగించుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఈ గ్రంథాలయాన్ని ఉపయోగించుకుని 2022-23 మధ్యలో అంటే కేవలం ఓ ఏడాది లోనే గ్రామానికి చెందిన 19 మంది విద్యార్థులు వివిధ ప్రభుత్వ శాఖల్లో ఉద్యోగాలు సంపాదించారు. ఈ నేపథ్యంలో లైబ్రరీ వ్యవస్థాపకులు సంజయ్ భాబోర్ మాటాడుతూ.. ఈ విద్యార్థులను చూసి గ్రామాల్లోని యువత ప్రేరణ పొందాలని సూచించారు.
తాజావార్తలు
-
Solar Eclipse 2026: మరికొన్ని గంటల్లో సూర్య గ్రహణం.. ఈ రాశుల వారు జాగ్రత్తగా ఉండాలి..
-
karnataka: మంత్రులకు శాఖలు కేటాయింపు.. డీకే.శివకుమార్ దగ్గరే కీలక శాఖ
-
Delhi: ఢిల్లీ ఎయిర్‌పోర్టులో కలకలం.. హైదరాబాద్ ప్రయాణికుడి బ్యాగ్‌లో కోతి పుర్రె..
-
Indiramma Houses: ఇందిరమ్మ ఇండ్ల టవర్స్.. రేపు సీఎం రేవంత్ చేతుల మీదుగా శంకుస్థాపన
-
Iran-Trump: ట్రంప్ దిగిపోయేంత వరకు పోరాడతాం.. ఇరాన్ కొత్త శపథం
ట్రెండింగ్
-
Rahul Dravid Records: రాహుల్ ద్రవిడ్ ఈ 3 రికార్డులు ఎవరూ బ్రేక్ చేయలేరు.. సచిన్ వల్లనే సాధ్యం కాలేదు!
-
Homemade Anti-Aging Cream: ముఖంపై ముడతలు తగ్గి ‘గ్లో’ రావాలా..? ఇంకెందుకు ఆలస్యం ఈ హోంమేడ్ క్రీమ్ ట్రై చేయండి.!
-
AI పెట్టుబడుల వేళ Oracleలో ఉద్యోగాల కోతలు.. వేలాది ఉద్యోగాలపై వేటు?
-
N Chandrasekaran: టాటా గ్రూప్‌లో కీలక పరిణామం.. చైర్మన్ పదవికి ‘చంద్రశేఖరన్’ రాజీనామా?
-
Akhil NRD: “ప్రేమ పెళ్లి”.. కండక్టర్‌తో లేచిపోయిన ప్రముఖ యూట్యూబర్ భార్య..