NTV Telugu Site icon

Karnataka: కర్ణాటక అసెంబ్లీ నుంచి 6 నెలల పాటు బీజేపీ ఎమ్మెల్యేలు సస్పెండ్..

Karnataka

Karnataka

Karnataka: కర్ణాటక అసెంబ్లీ సమావేశాలు రసాభసగా మారాయి. కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకువచ్చిన ముస్లింలకు ప్రభుత్వ కాంట్రాక్టుల్లో 4 శాతం రిజర్వేషన్లు కల్పించడాన్ని ప్రతిపక్ష బీజేపీ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. సభలో అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీజేపీ మధ్య తీవ్రస్థాయిలో ఉద్రిక్త పరిస్థితులు నెలకున్నాయి. ఇదిలా ఉంటే, మాజీ ఉప ముఖ్యమంత్రి డాక్టర్ సీఎన్ అశ్వత్ నారాయణ్‌తో సహా 18 మంది బీజేపీ ఎమ్మెల్యేలను అసెంబ్లీ నుంచి 6 నెలల పాటు సస్పెండ్ చేస్తూ స్పీకర్ యూటి ఖాదర్ సంచలన నిర్ణయం తీసుకున్నారు.

Read Also: IPL 2025: ఈ సీజన్ ఐపీఎల్ అంపైర్లు వీరే.. ఏడుగురు కొత్తవారికి ఛాన్స్

‘‘క్రమశిక్షణారాహిత్యం’’ కారణంగా సస్పెండ్ చేసినట్లు చెప్పారు. అసెంబ్లీ కార్యకలాపాలకు అంతరాయం కలిగించినందుకు 18 మంది బిజెపి ఎమ్మెల్యేలను ఆరు నెలల పాటు సస్పెండ్ చేసే బిల్లును కర్ణాటక అసెంబ్లీ ఆమోదించింది. ఈ బిల్లును కర్ణాటక లా అండ్ పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి హెచ్‌కె పాటిల్ ప్రవేశపెట్టారు.

అంతకుముందు రోజు కూడా, ఈ ముస్లిం కోటా వివాదం సభను కుదిపేసింది. ఈరోజు సభలో బీజేపీ ఎమ్మెల్యేలు వెల్‌లోకి ప్రవేశించి, స్పీకర్ కుర్చీ ముందు కాగితాలు చింపి విసిరేశారు. దీనికి ముందు తనపై హనీట్రాప్ జరిగిందని మంత్రి కేఎన్ రాజన్న ఆరోపించడం సంచలనంగా మారింది.