NTV Telugu Site icon

CAA: సీఏఏ చట్టం ప్రకారం తొలిసారిగా 14 మందికి భారతీయ పౌరసత్వం..

Caa

Caa

CAA: పౌరసత్వ సవరణ చట్టం(CAA) కింద మొదటిసారిగా 14 మందికి పౌరసత్వ ధృవీకరణ పత్రాలను జారీ చేశారు. కేంద్ర హోంశాఖ కార్యదర్శి అజయ్ కుమార్ భల్లా సర్టిఫికేట్లను అందించారు. సీఏఏ ప్రకారం బంగ్లాదేశ్, పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ నుంచి వచ్చిన ముస్లిమేరత మైనారిటీలు అయిన హిందువులు, సిక్కులు, బౌద్ధులు, క్రిస్టియన్స్, పార్సీలు, జైన మతస్తులకు ఈ చట్టం ద్వారా భారత పౌరసత్వాన్ని కల్పించనున్నారు. 2019లో ఈ చట్టం ఆమోదం పొందినప్పటికీ, ఇటీవలే దీనిని అమలులోకి తీసుకువచ్చారు.

READ ALSO: Swati Maliwal: దాడి ఘటనలో స్వాతి మలివాల్‌తో ఆప్ సెటిల్‌మెంట్..?

2019లో సీఏఏని పార్లమెంట్ ఆమోదించింది. అయితే నాలుగేళ్ల తర్వాత ఈ ఏడాది మార్చి 11న కేంద్ర హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ (MHA) నిబంధనల నోటిఫికేషన్ ఇచ్చింది. ఆన్‌లైన్‌లో దరఖాస్తులను ప్రాసెస్ చేసిన తర్వాత బుధవారం 14 మంది పౌరసత్వ ధృవీకరణ పత్రాలను పొందారు. సర్టిఫికెట్లను కేంద్ర హోంశాఖ కార్యదర్శి అజయ్ కుమార్ భల్లా అందజేశారు. పోర్టల్ ద్వారా ఆన్‌లైన్ దరఖాస్తులను ప్రాసెస్ చేసిన తర్వాత సర్టిఫికేట్లు అందించారు. పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్‌లో మైనారిటీలుగా వివక్ష ఎదుర్కొంటున్న వారి కోసం 1955 పౌరసత్వ సవరణ చట్టాన్ని సవరించి సీఏఏని బీజేపీ ప్రభుత్వం తీసుకువచ్చింది.