Gujarat Floods: వరదల్లో కొట్టుకొచ్చిన మొసళ్లు.. వీడియో వైరల్
- గుజరాత్‌ను ముంచెత్తిన వరదలు
- జనావాసాల్లోకి కొట్టుకొచ్చిన మొసళ్లు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
గుజరాత్‌ను భారీ వరదలు ముంచెత్తాయి. ఊళ్లు.. చెరువులు ఏకమైపోయాయి. ఎటు చూసినా నీళ్లే కనిపిస్తున్నాయి. గ్రామాలకు గ్రామాలే నీట మునిగిపోయాయి. కార్లు, బైకులు, వస్తువులు అన్ని వరదల్లో కొట్టుకుపోయాయి. ఇక ఇళ్లు పూర్తిగా ధ్వంసం అయ్యాయి. అంతగా వరదలు బీభత్సం సృష్టించాయి. ఇక ఈ వరదల్లో మూగజీవాలు జనావాసాల్లోకి వచ్చేశాయి. మొసళ్లు ఇళ్లల్లోకి కొట్టుకొచ్చాయి. దీంతో జనాలు బెంబేలెత్తిపోతున్నారు. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఇది కూడా చదవండి: Railway Station Collapses: మిజోరంలో కొండచరియలు విరిగిపడి కుప్పకూలిన రైల్వే స్టేషన్
Also Read
- Yogi Adityanath: ‘‘ఇద్దరం పోటీ చేద్దాం, అదృష్టాన్ని పరీక్షించుకుందాం’’.. అఖిలేష్‌కు యోగి సవాల్..
- Rekha Gupta: ఢిల్లీని బందీగా మార్చనివ్వం.. విపక్షాల కుట్రను తిప్పికొడతామన్న రేఖా గుప్తా
- Supreme Court: సీజేపీ నిరసనలపై సుప్రీంకోర్టు సీరియస్.. ఆదివారం ప్రత్యేక విచారణ..
- Earthquake: ఉత్తరాఖండ్‌లో భూప్రకంపనలు.. ప్రజలు పరుగులు
రాష్ట్రంలో నదులు, డ్యామ్‌లు నిండుకుండల్లా తలపిస్తున్నాయి. పలు నదులు ప్రమాదకరస్థాయిలో ప్రవహిస్తున్నాయి. దీంతో మొసళ్లు గ్రామాల్లోకి కొట్టుకొచ్చేస్తున్నాయి. ఈ క్రమంలో వడోదర జిల్లాలోని విశ్వామిత్ర నది నుంచి భారీగా మొసళ్లు జనావాసాల్లోకి వచ్చాయి. వడోదరలోని మహారాజా సాయాజీరావు యూనివర్సిటీ క్యాంపస్‌లోని జువాలజీ విభాగానికి సమీపంలో 11 అడుగుల మొసలిని స్థానికులు గుర్తించారు. మొసలిని చూసి తీవ్ర భయాందోళనకు గురయ్యారు. వెంటనే అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు. అధికారులు… స్థానికుల సాయంతో మొసలిని సురక్షితంగా బంధించారు. వడోదరలోని అకోటా ప్రాంతంలో కూడా ఓ మొసలి ఇంటి పైకప్పు ఎక్కిన వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది. వడోదరకు 17 కిలోమీటర్ల దూరంలో ఉన్న నదిలోంచి మొసళ్లు వచ్చినట్లుగా అధికారులు గుర్తిస్తున్నారు.
ఇది కూడా చదవండి: Kangana Ranaut: “అత్యాచారాలను చిన్నచూపు చూడటం సర్వసాధారణమైంది”
#WATCH | Vadodara, Gujarat: Forest Department rescues the crocodile seen on the campus of the Maharaja Sayajirao University of Baroda pic.twitter.com/joBQjJfAHW
— ANI (@ANI) August 29, 2024
Video of a crocodile at a Vadodara locality goes viral- #Watch.#ViralVideo #Gujaratfloods #crocodile #Vadodara #GujaratRains pic.twitter.com/DWRUDRavjh
— TIMES NOW (@TimesNow) August 29, 2024
VIDEO | Gujarat Rains: Crocodile spotted at roof of a house as heavy rainfall inundate Akota Stadium area of Vadodara.
(Full video available on PTI Videos – https://t.co/n147TvqRQz)#GujaratRains #GujaratFlood pic.twitter.com/FYQitH7eBK
— Press Trust of India (@PTI_News) August 29, 2024
తాజావార్తలు
-
Yogi Adityanath: ‘‘ఇద్దరం పోటీ చేద్దాం, అదృష్టాన్ని పరీక్షించుకుందాం’’.. అఖిలేష్‌కు యోగి సవాల్..
-
AP Govt: NTR వైద్య సేవలో అక్రమాలపై వేటు.. 203 ఆసుపత్రులకు రూ.34.39 కోట్ల జరిమానా..
-
Rekha Gupta: ఢిల్లీని బందీగా మార్చనివ్వం.. విపక్షాల కుట్రను తిప్పికొడతామన్న రేఖా గుప్తా
-
Virender Sehwag: ‘ఫస్ట్ బంతి నుంచే సిక్సర్లు’.. సూర్యవంశీకి సెహ్వాగ్ కీలక సూచనలు..
-
CM Revanth Reddy: ఎల్‌నినోతో పొంచి ఉన్న సంక్షోభం.. గ్రామస్థాయి నుంచి ప్రజలను అప్రమత్తం చేయాలి..
ట్రెండింగ్
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!