గుజరాత్‌ను భారీ వరదలు ముంచెత్తాయి. ఊళ్లు.. చెరువులు ఏకమైపోయాయి. ఎటు చూసినా నీళ్లే కనిపిస్తున్నాయి. గ్రామాలకు గ్రామాలే నీట మునిగిపోయాయి. కార్లు, బైకులు, వస్తువులు అన్ని వరదల్లో కొట్టుకుపోయాయి. ఇక ఇళ్లు పూర్తిగా ధ్వంసం అయ్యాయి. అంతగా వరదలు బీభత్సం సృష్టించాయి.
దేశ వ్యాప్తంగా ఆయా రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ఉత్తర భారత్‌లో అయితే అత్యంత భారీ వర్షాలు కురుస్తు్న్నాయి. దీంతో పలు ప్రాంతాలు జలమయం అయ్యాయి. ఇళ్లల్లోకి నీరు ప్రవేశించడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
గుజరాత్‌ను భారీ వరదలు ముంచెత్తాయి. రాష్ట్రంలో కుండపోత వర్షం కురవడంతో పలు జిల్లాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మునుపెన్నడూ లేనంతగా రాష్ట్రాన్ని వరదలు అతలాకుతలం చేశాయి.