Prashant Kishor: వరల్డ్ బ్యాంక్ డబ్బుతో గెలిచారు.. ఎన్డీయేపై ప్రశాంత్ కిషోర్ పార్టీ ఆరోపణ..
- వరల్డ్ బ్యాంక్ డబ్బు ఉపయోగించి గెలిచింది..
- బీహార్‌లో ఎన్డీయే గెలుపుపై ప్రశాంత్ కిషోర్ పార్టీ ఆరోపణలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Prashant Kishor: బీహార్ ఎన్నికల్లో కింగ్ మేకర్ అవుతారని అంతా భావించిన జన్ సురాజ్ పార్టీ అధినేత ప్రశాంత్ కిషోర్ ఘోరంగా విఫలమయ్యారు. రాష్ట్రంలో ఒక్క సీటులో కూడా ఆ పార్టీ అభ్యర్థి విజయం సాధించలేదు. ఎన్డీయే సునామీలో ఆర్జేడీ లాగే ప్రశాంత్ కిషోర్(పీకే) కొట్టుకుపోయారు. అయితే, పరాజయంపై తొలిసారిగా స్పందించిన పీకే పార్టీ, ఎన్డీయేపై సంచలన ఆరోపణలు చేసింది. సీఎం నితీష్ కుమార్ ప్రభుత్వం 2025 అసెంబ్లీ ఎన్నికల కోసం రూ.14,000 కోట్ల ప్రపంచ బ్యాంకు నిధిని మళ్లించిందని జన్ సురాజ్ పార్టీ ఆరోపించింది.
Read Also: Bhagyashri Borse : భాగ్యశ్రీ ఖాతాలో మరో ప్లాప్.. కనికరం చూపని కాంత
Also Read
- Modi-Trump: మోడీ–ట్రంప్ భేటీలో ట్విస్ట్.. ‘ప్రశ్నలు వద్దు’ అన్న భారత్, ట్రంప్ మాత్రం అడిగేశారు!
- AK-203: AK-203 ‘షేర్’.. రష్యన్ టెక్నాలజీ, మేడ్ ఇన్ ఇండియా రైఫిల్
- Uttar Pradesh: కాంగ్రెస్ ఎంపీ ఇంట్లో రాజకీయ చిచ్చు.. కుమార్తెపై అల్లుడి దాడి!
- Bangladesh: హసీనా ఎఫెక్ట్.. బంగ్లా ప్రధాని భారత్ పర్యటనపై తర్జనభర్జన!
ఎన్నిలక ఫలితాల తర్వాత జాతీయ అధ్యక్షుడు ఉదయ్ సింగ్ అన్నారు. జూన్ నుండి, ఎన్నికలు ప్రకటించే వరకు, నితీష్ కుమార్ ప్రభుత్వం ప్రజల డబ్బు ద్వారా ప్రజల ఓట్లను “కొనుగోలు” చేయడానికి రూ.40,000 కోట్లు ఖర్చు చేసిందని ఆయన ఆరోపించారు. ప్రపంచ బ్యాంకు నుంచి పొందిన రుణంలో రూ. 14,000 కోట్లను ఉచితాల కోసం వాడారని అన్నారు. రాష్ట్రంలోని మహిళల బ్యాంకు ఖాతాల్లోకి ఒక్కొక్కరికి రూ. 10,000 బదిలీ చేసిన ‘‘సీఎం మహిళా రోజ్ గార్ యోజన’’ పథకాన్ని దుయ్యబట్టారు. ఈ డబ్బులతో మహిళ ఓటర్లను ఆకట్టుకున్నారని అన్నారు. అధికాం కోసం బీజేపీ కూటమి అధికార దుర్వినియోగానికి పాల్పడిందని ఆరోపించారు.
ఇటీవల జరిగిన బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ, జేడీయూల ఎన్డీయే కూటమి ఘన విజయం సాధించింది. 243 సీట్లు ఉన్న అసెంబ్లీలో ఏకంగా 202 స్థానాలు సాధించింది. ఇందులో బీజేపీ 89, జేడీయూ 85 , చిరాగ్ పాశ్వాన్ ఎల్జేపీ 19, ఇతర పార్టీలు మిగిలిన స్థానాలను దక్కించుకున్నాయి. ఆర్జేడీ, కాంగ్రెస్‌ల మహాఘట్బంధన్ కేవలం 35 సీట్లకు మాత్రమే పరిమితమైంది.
తాజావార్తలు
-
Modi-Trump: మోడీ–ట్రంప్ భేటీలో ట్విస్ట్.. ‘ప్రశ్నలు వద్దు’ అన్న భారత్, ట్రంప్ మాత్రం అడిగేశారు!
-
Hollywood: హాలీవుడ్ దెబ్బకు బాలీవుడ్ బెంబేలు .. ‘స్పైడర్ మ్యాన్’ దూకుడుతో మారుతున్న బాక్సాఫీస్ లెక్కలు
-
Yashasvi Jaiswal: ‘అలా ప్రవర్తించకూడదు’.. జైస్వాల్‌పై ఐసీసీ చర్యలు తప్పవు?
-
Karn Sharma Retirement: నాలుగు ఐపీఎల్ టైటిళ్ల హీరో రిటైర్మెంట్.. భారత్, ఐపీఎల్, దేశవాళీ క్రికెట్‌కు గుడ్‌బై!
-
Rahul Ramakrishna: అలాంటి పాత్రలు చేయడం ఇష్టం లేదు.. విజయ్ దేవరకొండ నా కాల్స్ తీసుకోవడం మానేశాడు..
ట్రెండింగ్
-
IP Ratings: IP67, IP68, IP69 అంటే ఏమిటి? స్మార్ట్‌ఫోన్ కొనేముందు ఈ వాటర్‌ప్రూఫ్ రేటింగ్స్ గురించి తప్పక తెలుసుకోండి.!
-
Vaibhav Sooryavanshi: 8 పరుగులకే ఔట్.. అరంగేట్రంలోనే వైభవ్ సూర్యవంశీ అట్టర్ ఫ్లాఫ్!
-
Home Remedies: వర్షాకాలంలో ఇంట్లో జెర్రులు, దోమలు, చీమలు, నల్లులకు చెక్ పెట్టే చిట్కాలు ఇవే!
-
Home Safety Tips: పాములను ఇంట్లోకి రాకుండా తరిమికొట్టే చిట్కాలు ఇవే.. ఈ జాగ్రత్తలు తీసుకోండి..
-
Maharashtra: “ఇది కదా విశ్వాసం అంటే”.. యజమానులు తిరిగిరారని తెలియక.. తిండి, నీళ్లు మానేసిన పెంపుడు కుక్క