Andhra Pradesh Cyclone Alert: బంగాళాఖాతంలో బలపడుతున్న అల్పపీడనం.. ఏపీకి తుఫాన్ ముప్పు.. పలు జిల్లాల్లో భారీ వర్షాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Andhra Pradesh Cyclone Alert: తూర్పు మధ్య బంగాళాఖాతంలో కేంద్రీకృతమైన అల్పపీడనం క్రమంగా బలపడుతూ తుపానుగా మారే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. ఈ అల్పపీడనం ఈ రోజు వాయుగుండంగా మారి, పశ్చిమ-వాయువ్య దిశగా కదులుతూ ఆదివారం నాటికి తీవ్ర వాయుగుండంగా బలపడే అవకాశం ఉందని అంచనా వేసింది. సోమవారం నాటికి పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో తుపానుగా మారే అవకాశముందని తెలిపింది. అనంతరం మరింత బలపడి, ఆ తర్వాత రెండు రోజుల్లో ఉత్తరాంధ్ర–దక్షిణ ఒడిశా తీరాల వైపు కదిలే అవకాశం ఉందని పేర్కొంది.
మూడు రోజుల పాటు వర్షాలు
ఈ వాతావరణ వ్యవస్థ ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌లో పలు జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉంది. నేడు, రేపు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. సోమవారం కోస్తాంధ్రలో అక్కడక్కడ మోస్తరు వర్షాలు కురవవచ్చని, మంగళ, బుధవారాల్లో పలు జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉందని హెచ్చరించింది.
Also Read
- Cyclone Alert : బంగాళాఖాతంలో మారుతున్న వాతావరణం.. ఏపీకి అలర్ట్
- AP Municipal Elections 2026: ఏపీ మున్సిపల్ ఎన్నికలు వాయిదా.. కొత్త తేదీలు ఇవే.!
- AP Localbody Elections: ఏపీలో స్థానిక ఎన్నికలు.. SEC కీలక నిర్ణయాలపై ఉత్కంఠ.!
- CM Chandrababu: రెబల్స్‌కు చంద్రబాబు ఫైనల్ వార్నింగ్.. నామినేషన్లు విత్‌డ్రా చేసుకోకుంటే వేటే..!
ఏయే జిల్లాల్లో వర్షాలు కురుస్తాయి?
ఇక, ఇవాళ కోనసీమ, పశ్చిమగోదావరి, కృష్ణా, గుంటూరు, బాపట్ల, ప్రకాశం జిల్లాలతో పాటు రాయలసీమ ప్రాంతంలోని జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉండగా.. రేపు అల్లూరి సీతారామరాజు, పోలవరం ప్రాంతం, కృష్ణా, గుంటూరు, బాపట్ల, పల్నాడు, మార్కాపురం, ప్రకాశం జిల్లాలతో పాటు రాయలసీమ ప్రాంతంలోని జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.
సోమవారం రోజు రాయలసీమ జిల్లాల్లో పలుచోట్ల తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉంది. మంగళవారం నాడు విశాఖపట్నం, అనకాపల్లి జిల్లాల్లో అక్కడక్కడ అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించారు. ఇక, బుధవారం రోజు అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి, కాకినాడ, తూర్పుగోదావరి, కోనసీమ, పశ్చిమగోదావరి జిల్లాల్లో అక్కడక్కడ అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది.
తీర ప్రాంతాల్లో బలమైన గాలులు
తుపాను ప్రభావంతో తీర ప్రాంతాల్లో బలమైన ఈదురు గాలులు వీచే అవకాశం ఉంది. సముద్రంలో వేటకు వెళ్లిన మత్స్యకారులు వెంటనే తీరానికి తిరిగి రావాలని అధికారులు సూచించారు. వాతావరణ పరిస్థితులు అనుకూలించే వరకు సముద్రంలోకి వేటకు వెళ్లకుండా అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. మరోవైపు.. భారీ వర్షాలు, బలమైన గాలుల నేపథ్యంలో ప్రజలు, రైతులు తమ పనుల్లో ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ సూచించింది. వాతావరణ పరిస్థితులను గమనిస్తూ అధికారులు జారీ చేసే హెచ్చరికలను పాటించాలని, అత్యవసర పరిస్థితుల్లో అప్రమత్తంగా ఉండాలని పేర్కొంది.
అత్యవసర సహాయం కోసం టోల్ ఫ్రీ నంబర్లు
తుపాను సమాచారం, అత్యవసర సహాయం కోసం రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థలోని స్టేట్ ఎమర్జెన్సీ ఆపరేషన్ సెంటర్‌ను సంప్రదించవచ్చు. ఇందుకోసం 112, 1070, 18004250101 టోల్ ఫ్రీ నంబర్లను అందుబాటులో ఉంచినట్లు సంస్థ తెలిపింది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తుపానుగా బలపడే అవకాశం ఉన్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, మత్స్యకారులు, రైతులు, తీర ప్రాంత ప్రజలు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ సూచించింది.
తాజావార్తలు
-
IND vs NZ 2nd T20I: నేడు భారత్-న్యూజిలాండ్ రెండో టీ20.. లైవ్ స్ట్రీమింగ్, పిచ్ రిపోర్ట్, ప్లేయింగ్ 11 ఇదే!
-
Ankeet Bawane: వరుసగా రెండు సెంచరీలు (150+, 200).. రంజీల్లో తిరుగులేని ప్లేయర్‌గా రికార్డు..
-
Andhra Pradesh Cyclone Alert: బంగాళాఖాతంలో బలపడుతున్న అల్పపీడనం.. ఏపీకి తుఫాన్ ముప్పు.. పలు జిల్లాల్లో భారీ వర్షాలు
-
Meghana Retirement: బిగ్ షాక్.. క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన ఇండియన్ ప్లేయర్..
-
Astrology: అక్టోబర్ 24 శనివారం దినఫలాలు.. ఈ రాశివారికి అనుకోని గుడ్‌న్యూస్..
ట్రెండింగ్
-
LPG Gas Saving Tips: మీ గ్యాస్ సిలిండర్ త్వరగా అయిపోతోందా?.. ఈ చిన్న టిప్స్ పాటిస్తే ఎంతో ఆదా!
-
Used Tea Leaves: వాడేసిన టీ పొడిని పారేస్తున్నారా? ఆ చెత్తతో గాజు వస్తువులు మెరిపించవచ్చని తెలుసా?
-
Virat Kohli vs Pakistan: భారత్ – పాక్ సమరం.. జీవితంలో మరిచిపోలేని విరాట్ కోహ్లీ మాస్ ఇన్నింగ్స్..!
-
స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ జెన్ 5, యాక్టివ్ కూలింగ్ ఫ్యాన్‌తో OnePlus Ace 7 Pro.. అక్టోబర్ 29న గ్రాండ్ ఎంట్రీ..!
-
Yellow Gas Flame: గ్యాస్ మంట పసుపు లేదా నారింజ రంగులో వస్తోందా? ప్రమాదం పొంచి ఉండొచ్చు జాగ్రత్త సుమీ..!