మిగతా హీరోలతో పోల్చితే రేసులో చాలా వెనకబడిపోయారు అక్కినేని హీరోలు. నాగార్జున, నాగచైతన్య, అఖిల్ బ్యాక్ టు బ్యాక్ ఫ్లాప్స్‌తో సతమతమవుతున్నారు. ముఖ్యంగా నాగ చైతన్య, అఖిల్ ఘోరమైన డిజాస్టర్స్ అందుకున్నారు. ఇటీవల వచ్చిన ఏజెంట్, కస్టడీ సినిమాలతో బాక్సాఫీస్ దగ్గర 50 కోట్ల వరకు నష్టాన్ని మిగిల్చారు అక్కినేని బ్రదర్స్. ముఖ్యంగా చైతన్య వరుస ఫ్లాపులు ఫేజ్ చేస్తున్నాడు. బాలీవుడ్‌లో అమీర్ ఖాన్‌తో చేసిన లాల్ సింగ్ చడ్డా, దిల్ రాజు బ్యానర్లో వచ్చిన థాంక్యూ.. కోలీవుడ్ టాలెంటెడ్ డైరెక్టర్ వెంకట్ ప్రభుతో చేసి కస్టడీ సినిమాలు.. చైకి హిట్ ఇవ్వలేకపోయాయి. దాంతో నాగ చైతన్యకు అర్జెంట్‌గా ఓ హిట్ పడితే బాగుంటుదని భావిస్తున్నారు అక్కినేని ఫ్యాన్స్. ఈ క్రమంలో చైతన్యకు ఓ సాలిడ్ ప్రాజెక్ట్ సెట్ అయిపోయింది. అల్లు అరవింద్ గీతా ఆర్ట్స్ లాంటి సక్సెస్‌ఫుల్ బ్యానర్‌లో చైతన్య ఓ సినిమా చేయబోతున్నాడు.
కార్తికేయ2 మూవీతో పాన్ ఇండియా హిట్ అందుకున్న డైరెక్టర్ చందూ మొండేటి ఈ ప్రాజెక్ట్ హ్యాండిల్ చేస్తున్నాడు. త్వరలోనే ఈ సినిమా సెట్స్‌పైకి వెళ్లనుంది. తాజాగా ఈ సినిమా గురించి నిర్మాత బన్నీ వాసు అదిరిపోయే అప్డేట్ ఇచ్చాడు. సముద్రం బ్యాక్ డ్రాప్‌లో ఈ మూవీ రాబోతుందని చెప్పుకొచ్చాడు. చైతన్య బోట్‌మ్యాన్‌గా, జాలరీగా కనిపిస్తాడని అన్నారు. గుజరాత్‌లో జరిగిన కొన్ని నిజ జీవిత ఘటనల ఆధారంగా ఈ సినిమా ఉంటుందని అన్నారు. దాంతో ఈ సినిమా కోసం భారీ బడ్జెట్ ఖర్చు చేయబోతున్నట్టు తెలుస్తోంది. దాదాపు యాభై కోట్లకు పైగానే పెట్టబోతున్నట్టు ఇండస్ట్రీ టాక్. ఈ లెక్కన చైతు కెరీర్లో హయ్యెస్ట్ బడ్జెట్ ఫిల్మ్ ఇదేనని చెప్పొచ్చు. గీతా ఆర్ట్స్ సంస్థ ఈ రేంజ్‌లో ఖర్చు చేస్తుందంటే.. ఖచ్చితంగా నాగ చైతన్య కెరీర్లో ఈ సినిమా ఓ మైలుగారాయిగా నిలిచిపోతుందనే నమ్మకంతో ఉన్నారు అక్కినేని ఫ్యాన్స్. మరి చైతన్య ఏం చేస్తాడో చూడాలి.