Vijayasai Reddy: హీరోల కొడుకులే హీరోలా.. వాళ్ళకి ఎందుకంత రెమ్యునరేషన్?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
YSRCP MP Vijayasai Reddy comments on heros remuneration: రాజ్యసభలో సినిమాటోగ్రఫీ సవరణ బిల్లుపై జరిగిన చర్చలో వైసీపీ రాజ్యసభ ఎంపీ వేణుంబాక విజయసాయిరెడ్డి కీలక సూచనలు చేశారు. దీనికి సంబంధించిన చర్చ రాజ్యసభలో జరుగుతున్న నేపథ్యంలో ఎంపీ విజయసాయిరెడ్డి మాట్లాడుతూ సినిమా బడ్జెట్లో అధిక భాగం హీరోల రెమ్యూనరేషన్లే అని వెల్లడించారు. ముఖ్యంగా సల్మాన్ ఖాన్ లాంటి బడా హీరోలు 200 కోట్ల వరకు రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారని ఆయన అన్నారు. భారతీయ చలన చిత్ర రంగంలో వివిధ విభాగాల్లో రెండు లక్షల మందికి పైగా కార్మికులు పని చేస్తున్నారు కానీ బడ్జెట్లో మూడో వంతు బడ్జెట్ హీరోలు ఇతర అగ్రనటుల పారితోషకాలకే సరిపోతున్నాయని అన్నారు. ఈ పరిస్థితిలో మార్పు తీసుకురావడానికి ప్రభుత్వం చట్టపరమైన చర్యలు తీసుకోవాలని సభలో సినిమాటోగ్రఫి మంత్రి అనురాగ్ ఠాకూర్‌కు విజయసాయి రెడ్డి సూచించారు. ఇక సినిమా కోసం కష్టపడి పనిచేసే కార్మికులకు మాత్రం నామమాత్రపు జీతాలు ఇచ్చి సరిపెడుతున్నారని ఆయన పేర్కొన్నారు.
Prabhas FB Hacked: బిగ్ బ్రేకింగ్.. ప్రభాస్ ఫేస్ బుక్ పేజ్ హ్యాక్.. ఆ పోస్టు షేర్ చేసి?
Also Read
సినిమా అంటే హీరో ఒక్కడే కాదని స్పష్టం చేసిన ఆయన బడ్జెట్లో సింహభాగం హీరోలకు వెళ్లే సంస్కృతి మారాలని, ఈ మేరకు కేంద్ర సినిమాటోగ్రఫీ చట్టాన్ని బలోపేతం చేయాలని కేంద్రాన్ని కోరుతున్నాం అని వెల్లడించారు. హీరోల కొడుకులే ఎందుకు హీరోలు అవుతున్నారు అని ప్రశ్నించిన ఆయన దేశంలో ఎంతో మంది టాలెంట్ కలిగిన వారు ఉన్నారని ఆయన కామెంట్ చేశారు. హీరోల కుమారులే హీరోలు అవుతున్నారు. కానీ హీరోల కుమార్తెలు మాత్రం హీరోయిన్లు అవుతున్న ఉదంతాలు చాలా తక్కువ ఉన్నాయని విజయసాయిరెడ్డి అన్నారు. హీరోలు అయ్యే హీరోల కుమారులకంటే అందగాళ్ళయిన అబ్బాయిలు దేశంలో లెక్కకు మించి ఉన్నా, టాలెంట్ ఉన్నవారు ఉన్నా వారికి హీరోగా అవకాశాలు ఎందుకు దక్కడం లేదో అర్థం కావడం లేదని అన్నారు. చైనా కంటే ఎక్కువ జనాభా మన దగ్గర ఉన్నారు కానీ అక్కడ 80 వేల థియేటర్లు ఉంటే భారత్‌లో మాత్రం 8 వేల థియేటర్లు మాత్రమే ఉన్నాయని విజయసాయిరెడ్డి అన్నారు. అంతేకాదు సెన్సార్ బోర్డ్ సర్టిఫికెట్ పొందిన సినీ నిర్మాత లేదా దర్శకుడిపై ఎలాంటి క్రిమినల్ కేసులు దాఖలు కాకుండా నిరోధించేలా సినిమాటోగ్రఫీ చట్టంలో సవరణ చేయాలని విజయసాయి రెడ్డి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.
తాజావార్తలు
-
TDP, Jana Sena, BJP Candidates List: కూటమి సీట్ల పంపకం ఖరారు..! 17 కార్పొరేషన్లు.. 106 మున్సిపాలిటీలు.. ఏ పార్టీకి ఎక్కడంటే?
-
TG Safe Raids : ఈగలు, ఎలుకల మధ్య స్వీట్ల తయారీ.. 2,480 కిలోలు ధ్వంసం..
-
Off The Record: ఆశించినన్ని సీట్లు వచ్చే పరిస్థితి లేక పోవడంతో జనసైనికులు డీలా..!
-
OTR : బాల్కొండ టికెట్ నాదే.. ఇంచార్జ్ ముందే ఓపెన్‌గా ప్రకటించిన మానాల మోహన్ రెడ్డి
-
OTR: ఆ జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికల రిజర్వేషన్ లో కూటమిలో విభేదాలకు కారణం అవుతున్నాయా?
ట్రెండింగ్
-
Water Can Cleaning: 20 లీటర్ల నీళ్ల క్యాన్‌ను ఇలా కడుగుతున్నారా? ఈ తప్పులు వద్దు.!
-
Upma Rava vs Idli Rava : ఉప్మా రవ్వ, ఇడ్లీ రవ్వ ఒకటి కాదు.. అసలు తేడా ఇదే!
-
Small Kitchen Ideas: వంటగది కౌంటర్ ఎప్పుడూ తడిగా, చిందరవందరగా ఉంటుందా? ఈ చిన్న ప్లానింగ్ చేసుకోండి!
-
How To Grow Moringa: పోషకాల నిధి మునగ.. కుండీలో మురింగ చెట్టును ఈజీగా పెంచే టిప్స్ మీ కోసం..
-
IND vs WI 4th T20: అందరూ కాటేరమ్మకొడుకులే.. కానీ ఉప్పల్‌లో తుస్సుమన్నారు.. భారత్ ఓటమికి ఐదు కారణాలు ఇవే!