Youtuber Nandu : స్టేషన్ గుమ్మం వరకు కారు, రమా నందనకు పోలీసుల రాచమర్యాదలు?

Rama Nandana News

Rama Nandana News

విజయవాడలో సంచలనం రేపిన వీసా చీటింగ్ కేసులో యూట్యూబర్ రమా నందన పోలీసుల విచారణకు హాజరయ్యారు. న్యాయవాదులతో కలిసి ఇబ్రహీంపట్నం పీఎస్‌కి వచ్చిన ఆమెను పోలీసులు విచారిస్తున్నారు. విదేశాల్లో వీసా, ఉద్యోగం ఇప్పిస్తామంటూ రమానందన, ఆమె భర్త కలిసి 13 లక్షల రూపాయలు వసూలు చేశారంటూ క్రాంతి కుమార్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు. రమా నందన పోలీస్ స్టేషన్‌కు వచ్చిన తీరుపై విమర్శలు వినిపిస్తున్నాయి. రెండు కార్లలో న్యాయవాదులతో కలిసి ఆమె స్టేషన్‌లోని సీఐ కార్యాలయం వరకు వెళ్ళడం, స్టేషన్ గుమ్మం ముందు కారు నిలిపి ఉంచడంపై విమర్శలు వస్తున్నాయి.

స్టేషన్ వద్ద విధులు నిర్వహిస్తున్న జర్నలిస్టులతో రమానందన తరఫు న్యాయవాదులు వాగ్వాదానికి దిగటం చర్చనీయాంశంగా మారింది. యూట్యూబర్ రమానందనకు పోలీసుల రాచమర్యాదలపై జనం మండిపడుతున్నారు. బాధితుల ఆరోపణలపై స్పందించిన ఆమె తానేం తప్పు చేయలేదన్నారు. “ఎనిమిది నెలల తర్వాత యూకే నుంచి ఇండియా వచ్చినటువంటి యూట్యూబర్ రమా నందనను హైదరాబాద్ ఎయిర్‌పోర్టులో స్థానిక పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అదే సమయంలో కేసు నమోదైనటువంటి విజయవాడ ఇబ్రహీంపట్నం పోలీసులు ఇవాళ విచారణకు రావాలని నోటీసు జారీ చేయడంతో, ఇవాళ మధ్యాహ్నం 1:00 గంట సమయంలో రమా నందన న్యాయవాదులతో కలిసి విచారణకు హాజరయ్యారు. సుమారు మూడు గంటల పాటు పోలీసులు రమానందనను వివిధ కోణాల్లో ప్రశ్నించడం జరిగింది.