Youtuber Nandu : స్టేషన్ గుమ్మం వరకు కారు, రమా నందనకు పోలీసుల రాచమర్యాదలు?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
విజయవాడలో సంచలనం రేపిన వీసా చీటింగ్ కేసులో యూట్యూబర్ రమా నందన పోలీసుల విచారణకు హాజరయ్యారు. న్యాయవాదులతో కలిసి ఇబ్రహీంపట్నం పీఎస్‌కి వచ్చిన ఆమెను పోలీసులు విచారిస్తున్నారు. విదేశాల్లో వీసా, ఉద్యోగం ఇప్పిస్తామంటూ రమానందన, ఆమె భర్త కలిసి 13 లక్షల రూపాయలు వసూలు చేశారంటూ క్రాంతి కుమార్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు. రమా నందన పోలీస్ స్టేషన్‌కు వచ్చిన తీరుపై విమర్శలు వినిపిస్తున్నాయి. రెండు కార్లలో న్యాయవాదులతో కలిసి ఆమె స్టేషన్‌లోని సీఐ కార్యాలయం వరకు వెళ్ళడం, స్టేషన్ గుమ్మం ముందు కారు నిలిపి ఉంచడంపై విమర్శలు వస్తున్నాయి.
స్టేషన్ వద్ద విధులు నిర్వహిస్తున్న జర్నలిస్టులతో రమానందన తరఫు న్యాయవాదులు వాగ్వాదానికి దిగటం చర్చనీయాంశంగా మారింది. యూట్యూబర్ రమానందనకు పోలీసుల రాచమర్యాదలపై జనం మండిపడుతున్నారు. బాధితుల ఆరోపణలపై స్పందించిన ఆమె తానేం తప్పు చేయలేదన్నారు. “ఎనిమిది నెలల తర్వాత యూకే నుంచి ఇండియా వచ్చినటువంటి యూట్యూబర్ రమా నందనను హైదరాబాద్ ఎయిర్‌పోర్టులో స్థానిక పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అదే సమయంలో కేసు నమోదైనటువంటి విజయవాడ ఇబ్రహీంపట్నం పోలీసులు ఇవాళ విచారణకు రావాలని నోటీసు జారీ చేయడంతో, ఇవాళ మధ్యాహ్నం 1:00 గంట సమయంలో రమా నందన న్యాయవాదులతో కలిసి విచారణకు హాజరయ్యారు. సుమారు మూడు గంటల పాటు పోలీసులు రమానందనను వివిధ కోణాల్లో ప్రశ్నించడం జరిగింది.
Also Read
- Mohan Babu: "నాని పర్మిషన్తో నన్ను పెట్టుకోవడానికి వచ్చావా? అక్కడ కొట్టింది నా ఈగో"
- Nani: "శ్రీకాంత్‌ను అస్సలు పొగడను.. వాడితో చాలా స్ట్రిక్ట్‌గా ఉంటా": నాని
- Srikanth Odela: "మోహన్ బాబు హిట్లర్ అన్నారు.. తీరా చూస్తే షాకయ్యా"
- Sampoornesh Babu: 'కొబ్బరిమట్ట తర్వాత ఆగిన నా ఫోన్.. మళ్లీ 'ది ప్యారడైజ్' కే మోగింది!'.. సంపూర్ణేష్ బాబు ఎమోషనల్
తాజావార్తలు
-
US-Iran: మళ్లీ కమ్ముకుంటున్న యుద్ధ మేఘాలు.. ఇరాన్ శాంతి ఒప్పందాన్ని తిరస్కరించిన ట్రంప్!
-
CM Revanth Reddy: మన్మోహన్ సింగ్ గొప్ప రాజనీతిజ్ఞుడు.. ‘భారతరత్న’ ఇవ్వాల్సిందే..
-
CM Chandrababu: ఈసీ వివరణపై స్పందించిన సీఎం చంద్రబాబు.. కీలక వ్యాఖ్యలు..
-
CEC Impeachment: CEC జ్ఞానేష్ కుమార్‌ను తొలగించడం అంత ఈజీ కాదు.. రాజ్యాంగం ఏం చెబుతోంది.?
-
Banks Merged: ఖాతాదారులకు బిగ్ అలర్ట్.. మరో రెండు బ్యాంకులు విలీనం..!
ట్రెండింగ్
-
Xiaomi Pocket Guitar: చేతిలో ఫోన్.. వెనుక గిటార్..! Xiaomi సరికొత్త యాక్సెసరీ మాములుగా లేదుగా.!
-
Hardik Pandya: రీఎంట్రీకి మరో బ్రేక్.. స్కాన్‌లో బయటపడ్డ కొత్త గాయం.!
-
Saturday Horoscope: ఆ రాశి వారికి నేడు పట్టిందల్లా బంగారమే.. నేటి రాశిఫలాలు ఇలా.!
-
Nuclear Weapons: 12 వేలకుపైగా అణ్వాయుధాలు.. ప్రపంచానికి పొంచి ఉన్న ముప్పేంటి.?
-
iPhone 18 Pro Max Review: ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? రూ.1.79 లక్షలు పెట్టి కొనాలా? వద్దా?