యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఆర్ ఆర్ ఆర్ తర్వాత పాన్ ఇండియా స్థాయిలో చేస్తున్న సినిమా ‘దేవర’. కొరటాల శివ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాతో ఎన్టీఆర్ మరో పాన్ ఇండియా హిట్ కొట్టడం గ్యారెంటీ అనే నమ్మకం అందరిలో ఉంది. ఆ అంచనాలని కొరటాల శివ ఎంతవరకూ అందుకుంటాడు అనే విషయం 2024 ఏప్రిల్ 05న తెలియనుంది. ఇప్పటికైతే దేవర షూటింగ్ జెట్ స్పీడ్ లో జరుగుతుంది. రెగ్యులర్ షూటింగ్ మొదలై నాలుగు నెలలు అయ్యింది అప్పుడే దాదాపు ఆరు షెడ్యూల్స్ ని కంప్లీట్ చేశారని సమాచారం. సైఫ్ అలీ ఖాన్ విలన్ గా నటిస్తున్న దేవర సినిమాకి సంబంధించి ఇప్పటివరకూ షూటింగ్ చేసింది అంతా యాక్షన్ ఎపిసోడ్స్ మాత్రమే కావడం విశేషం.
Read Also: Gabbar Singh: ఏం వార్త చెప్పావ్ బండ్లన్న… పవర్ స్టార్ రేంజ్ ఏంటో చూపిచండి!
ముందుగా యాక్షన్ బ్లాక్స్ ని కంప్లీట్ చేస్తే విజువల్ ఎఫెక్ట్స్ చేయడానికి కావాల్సినంత సమయం దొరుకుతుంది. అప్పుడు క్వాలిటీ vfx వర్క్ ఆన్ స్క్రీన్ కనిపిస్తుంది. యాక్షన్ పార్ట్ అయిపోగానే దేవర టాకీ పార్ట్ షూటింగ్ కి వెళ్తుంది. ఇదే స్పీడ్ ని మైంటైన్ చేస్తే దేవర షూటింగ్ ముందుగా ప్లాన్ చేసుకున్నట్లు నవంబర్ నెలకి కంప్లీట్ అవ్వడం గ్యారెంటీ. నవంబర్ నుంచి కొంచెం రెస్ట్ తీసుకోని ఎన్టీఆర్, హృతిక్ రోషన్ తో వార్ చేయడానికి ముంబై వెళ్తున్నాడు. ఫెబ్ వరకూ వార్ 2 షూటింగ్ జరగనుంది. ఇదిలా ఉంటే దేవర సినిమాలో ఎన్టీఆర్, ఒక తిమింగలంతో ఫైట్ చేస్తాడు అనే రూమర్ సోషల్ మీడియాలో వినిపిస్తోంది. ఇది ఉత్త గాలి వార్త మాత్రమే, దేవరలో అలాంటి యాక్షన్ ఎపిసోడ్ లేదని సమాచారం.