ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ తరువాత యావత్ సినీ అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న చిత్రం కెజిఎఫ్ 2. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఏప్రిల్ 14 న రిలీజ్ కానుంది. ఇక అయి నేపథ్యంలోనే ప్రమోషన్ల వేగాన్ని పెంచేశారు చిత్ర బృందం. ఈ ప్రమోషన్లో భాగంగానే ఇటీవలే ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ అయిన సంగతి తెల్సిందే. పవర్ ప్యాక్డ్ గా కట్ చేసిన ఈ ట్రైలర్ కేవలం 24 గంటల్లోనే 100 మిలియన్ వ్యూస్ సాధించి రికార్డ్ సృష్టించింది. ఇక ఈ ట్రైలర్ లో వైలెన్స్.. వైలెన్స్.. అది నాకు ఇష్ష్టం ఉండదు.. కానీ, వైలెన్స్ కే నేనంటే ఇష్టం.. అందుకే దాన్నిఅవైడ్ చేయలేను అని యష్ చెప్పిన డైలాగ్ అభిమానులను విశేషంగా ఆకట్టుకున్న విషయం విదితమే.
ఇక ఈ డైలాగ్ ని రాసింది మరెవరో కాదు హీరో యష్ యేనట. ఈ విషయాన్నీ దర్శకుడు ప్రశాంత్ నీల్ ఒక ఇంటర్వ్యూలో తెలిపారు. “ప్రేక్షకులు ఎలాంటి డైలాగ్స్ వినాలనుకుంటున్నారు అనేది యష్ కి బాగా తెలుసు.. అలాంటి డైలాగ్స్ ని తనే ఆలోచించి రాశాడు. ఈ ఒక్క డైలాగ్ మాత్రమే కాదు.. సినిమాలో కొన్ని డైలాగ్స్ ని యష్ రాశాడు. ఈ సినిమాకోసం అతను చాలా కష్టపడ్డాడు” అంటూ చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారిపోయాయి. దీంతో అభిమానులు యష్ లో ఈ యాంగిల్ కూడా ఉందా.. ఎంతైనా మా హీరో మల్టీ టాలెంటెడ్ అంటూ కామెంట్స్ పెడుతున్నారు. మరి ఎన్నో అంచనాల మధ్య విడుదల కానున్న ఈ సినిమా ఎలాంటి ఫలితాన్ని అందుకుంటుందో చూడాలంటే ఇంకొన్ని రోజులు ఆగాల్సిందే.