Yakshini Trailer Launched: ఆర్కా మీడియా వర్క్స్, డిస్నీ ప్లస్ హాట్ స్టార్ కాంబినేషన్ లో ఇంట్రెస్టింగ్ వెబ్ సిరీస్ “యక్షిణి” ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ వెబ్ సిరీస్ ను శోభు యార్లగడ్డ, ప్రసాద్ దేవినేని నిర్మిస్తున్నారు. వేదిక, మంచు లక్ష్మి, రాహుల్ విజయ్, అజయ్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ “యక్షిణి” సిరీస్ ను దర్శకుడు తేజ మార్ని రూపొందిస్తున్నారు. జూన్ 14న తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళ, హిందీలో “యక్షిణి” వెబ్ సిరీస్ స్ట్రీమింగ్ కు రాబోతోంది. ఈ క్రమంలో “యక్షిణి” వెబ్ సిరీస్ ట్రైలర్ లాంఛ్ ను హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు.
Samyuktha Menon: బాలీవుడ్ డెబ్యూకి స్టార్ హీరోయిన్ రెడీ..కానీ?
ఇక ఈ ట్రైలర్ ను కనుక మనం గమనిస్తే కుబేరుని రాజ్యం అలకాపురిలో ఉండే ఓ యక్షిణి(వేదిక) మనిషి ప్రేమ మాయలో పడి తన ధర్మాన్ని మరిచిపోవడంతో మనిషిగా మారి కొంత మందిని చంపిన తర్వాతే మళ్ళీ యక్షిణిగా మారతావు అనే శాపం పొందుతుంది. అయితే ఆ శాపం కారణంగా ఆ యక్షిణి పెళ్లి కోసం చూసే అబ్బాయి(రాహుల్ విజయ్) జీవితంలోకి యక్షిణి ఎలా వచ్చింది, మంచు లక్ష్మి, అజయ్ పాత్రలు అంటూ అంటూ ఆసక్తికరంగా చూపించారు. మైథాలజీ అంశాలతో పాటు సోషియో ఫాంటసీతో యక్షిణి సిరీస్ భయపెడుతూ మెప్పిస్తుందని ట్రైలర్ చూస్తేనే అర్థమవుతుంది.