ఒక సినిమా హిట్ అవ్వాలంటే ఆ సినిమాలో కథ ఎంత బలంగా ఉండాలో.. మేకర్స్ చేసే ప్రమోషన్స్ కూడా అంతే బలంగా ఉండాలి. ప్రస్తుతం చిత్ర పరిశ్రమలో సినిమాల కంటే ప్రమోషన్లకే ఎక్కువ ఖర్చుపెడుతున్నారు. అంతేకాకుండా ప్రమోషన్స్ కొత్తకొత్త గా చేస్తూ కొంతమంది ప్రజలను ఆకట్టుకుంటున్నారు.. ఇంకొంతమంది ఇదుగో ఇలా విమర్శల పాలవుతున్నారు. మాస్ కా దాస్ విశ్వక్ సేన్ ప్రస్తుతం వివాదంలో చిక్కుకున్నాడా..? అంటే నిజమనే అంటున్నాయి ఇండస్ట్రీ వర్గాలు. ఆయన హీరోగా నటించిన అశోకవనంలో అర్జున కళ్యాణం చిత్రం మే 6 న రిలీజ్ అవుతున్న విషయం విదితమే. రిలీజ్ డేట్ దగ్గరపడడంతో ప్రమోషన్స్ మొదలుపెట్టాడు విశ్వక్ సేన్. ఇక అందరిలా మనం కూడా ఇంటర్వ్యూ లు, ప్రెస్ మీట్లు పెడితే ఏం కిక్కు ఉంటుంది అనుకున్నాడో ఏమో ఈసారి ప్రమోషన్స్ ను కొత్తగా ప్రయత్నించాడు. ఒక యువకుడితో కలిసి ప్రాంక్ అంటూ హైదరాబాద్ లో నడిరోడ్డుపై రచ్చ రచ్చ చేశాడు.
స్టార్ హీరో సినిమా రిలీజ్ అవ్వడం ఆలస్యం థియేటర్ వద్ద మైక్ పట్టుకొని రివ్యూ ఇస్తూ సోషల్ మీడియాలో ఫేమస్ అయిన ఆ యువకుడు విశ్వక్ సేన్ కారును నడిరోడ్డుపై ఆపి, పెట్రోల్ డబ్బా తో విశ్వక్ ను అల్లం అర్జున్ ఎక్కడ అని అడుగుతుంటాడు. అతడిదిని సముదాయించి విశ్వక్ ఆ యువకుడిని కారులో పంపించడానికి ట్రై చేస్తుంటాడు. అల్లం అర్జున్ కు పెళ్లి కాలేదని, అతడు రాకపోతే పెట్రోల్ పోసుకొని నిప్పు అంటించుకుంటానని గట్టిగా అరెస్టు చెప్పడంతో అక్కడ అంతా న్యూసెన్స్ క్రియేట్ అయ్యింది. ప్రస్తుతం రఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది. ఇక ఈ ఫ్రాంక్ వీడియోపై అడ్వొకేట్ అరుణ్‌కుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సినిమా ప్రమోషన్స్ పేరుతో రోడ్లపై న్యూసెన్స్, పబ్లిక్‌కు అంతరాయం కలిగిస్తున్నారని, బహిరంగ ప్రదేశాల్లో సినిమా ప్రమోషన్స్ చేయొద్దని పోలీసులకు ఆదేశాలివ్వాలని హెచ్‌ఆర్సీలో చేశారు. ఇక నెటిజన్స్ సైతం.. నడిరోడ్డు పై వీరిద్దరూ కలిసి చేసిన హంగామా వల్ల అక్కడి జనాలకు అసౌకర్యం కలిగిందని.. ప్రమోషన్స్ పేరుతో పబ్లిక్ ప్లేస్ లో ప్రాంక్ లంటూ ఈ న్యూసెన్స్ ఏంటి? సినిమా ప్రచారం కోసం మరీ ఇంత దిగజారాలా? అని మండిపడుతున్నారు. మరి ఈ కేసుపై మాస్ కా దాస్ ఎలా స్పందిస్తాడో చూడాలి.