కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ గౌతమ్ వాసు దేవ్ మీనన్, హారీష్ జైరాజ్ కాంబో మరోసారి రిపీట్ కాబోతుందని కోలీవుడ్‌లో గట్టి బజ్ నడుస్తోంది. గతంలో గౌతమ్ సినిమాలకు వర్క్ చేశాడు హరీష్. గౌతమ్ పస్ట్ మూవీ మిన్నాలే (చెలి) దగ్గర నుండి వరుస ప్రాజెక్టులకు మ్యూజిక్ అందించి సినిమా సక్సెస్‌లో భాగమయ్యాడు హరీష్ జైరాజ్. కాకా కాకా, ఘర్షణ, వెట్టియాడు, వెల్లియాడు, పచ్చైకలి ముచ్చిత్రం, వారణం ఆయిరం వరకు బ్లాక్ బస్టర్సే.
Also Read : Mega Brothers : ‘మెగాస్టార్ చిరంజీవి’కి పవర్ స్టార్ స్పెషల్ విషెష్
గౌతమ్, హరీష్ కాంబోలో వచ్చిన సినిమాలు, పాటలు హిట్స్‌గా నిలిచాయి. కానీ ఆ తర్వాత విన్నతాండే ఒరువాయ తెలుగులో ఏమాయ చేశావే నుండి హరీష్‌కు బదులు ఏఆర్ రెహమాన్‌కు ఛాన్స్ ఇచ్చాడు గౌతమ్. వీరి మధ్య విబేధాల వల్లే హరీష్‌ను కాదని రెహమాన్ కు అవకాశమిచ్చాడని అప్పట్లో వార్తలు వచ్చాయి. అయితే మళ్లీ ఐదేళ్లకు అజిత్ ఎన్నాయ్ అరిందాల్ కోసం హరీష్‌ను అప్రోచ్ అయ్యాడు గౌతమ్. ఇక అప్పటి నుండి ఈ కాంబో సెట్ కాలేదు. ఎవరి కెరీర్ లో వాళ్లు బిజీ అయ్యారు. ఇప్పుడు పదేళ్లకు డైరెక్టర్- మ్యూజిక్ డైరెక్టర్ కలిసి వర్క్ చేయబోతున్నట్లు కోలీవుడ్ సర్కిల్స్‌లో వార్తలు వినిపిస్తున్నాయి. వరుస ప్లాపులతో సతమతమౌతున్న గౌతమ్ ఈగోలను పక్కన పెట్టి హరీష్‌ను అప్రోచ్ అయ్యాడని సమాచారం. విశాల్ హీరోగా సినిమా ఉండబోతుందని టాక్ నడుస్తోంది. త్వరలో అధికారిక ప్రకటన వెలువడే అవకాశాలున్నాయన్నది బజ్. చర్చల దశలో ఉన్న ఈ కాంబోసెట్ అయితే అంచనాలు వేరే లెవల్లో ఉంటుందన్నది వాస్తవం. మరీ ఈ హిట్ కాంబో రిపీట్ అవుతుందో మరికొద్ది రోజుల్లో క్లారిటీ రానుంది.