Will Smith : అకాడమీ నుండి తప్పుకున్న విల్ స్మిత్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఈ సారి జరిగిన ఆస్కార్ అవార్డుల వేడుకలో అనూహ్యంగా విల్ స్మిత్, వ్యాఖ్యాత క్రిస్ రాక్ పై చేయిచేసుకోవడం పెద్ద దుమారం రేపింది. విల్ స్మిత్ భార్య జడా పింకెట్ స్మిత్ బోడిగుండుపై రాక్ సరదాగా వ్యాఖ్యానించడంతో ఆగ్రహించిన స్మిత్ అతనిపై చేయి చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ విషయంపై అకాడమీ క్రమశిక్షణ కమిటీ ఇటీవల సమావేశమయింది. ఆ కమిటీ నిర్ణయం రాకమునుపే విల్ స్మిత్ తాను అకాడమీ సభ్యత్వానికి రాజీనామా సమర్పించారు. దానిని అకాడమీ సైతం ఆమోదించింది.
ఈ సందర్భంగా స్మిత్ తన చర్యలను తానే ఖండించుకున్నారు. తాను అలా ప్రవర్తించి ఉండకూడదని, ఇది అకాడమీ నియమనిబంధనలకు, గౌరవానికి, హుందా తనానికి భంగం కలిగించినట్టేనని అంగీకరించారు. తన చర్య వల్ల ఎంతోమంది ఆస్కార్ విజేతలు ఆ వేడుకలో ఆనందం పంచుకోలేక పోయారని, వారికి ఇబ్బంది కలిగించినందుకు క్షమించమని వేడుకున్నారు. తన ప్రవర్తన కారణంగా అకాడమీ నమ్మకాన్ని వమ్ము చేశానని, అది తనకెంతో బాధ కలిగిస్తోందని ఇకపై ఇలాంటి చర్యలకు దూరంగా ఉంటాననీ విల్ పేర్కొన్నారు. చిత్రరంగంలోని సృజనకు, కళాత్మకతకు అకాడమీ పెద్ద పీట వేస్తోందని, తన కారణంగా గౌరవప్రదమైన అకాడమీకి ఏలాంటి ఇబ్బందులు కలగబోవని విల్ హామీ ఇచ్చారు.
Also Read
- Varalaxmi Sarathkumar Controversy : నేను అరవను కరుస్తా... "పోలీస్ కంప్లైంట్" డైరెక్టర్ కు హీరోయిన్ వరలక్ష్మీ స్ట్రాంగ్ కౌంటర్
- Vadde Naveen : బాహుబలి కంటే పుష్పనే స్పెషల్... స్టార్స్ సినిమాలపై వడ్డే నవీన్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్
- Tollywood : తెలుగులో అప్పట్లో హ్యాట్రిక్ ఫ్లాప్స్.. అయినా వరుస ఛాన్సులు
- NBK 111 : దటీజ్ గాడ్ ఆఫ్ మాసెస్.. మాస్ అంటేనే బాలయ్య
ఇదిలా ఉండగా ఆస్కార్ అవార్డుల ప్రదానోత్సవంలో హోస్ట్ గా వ్యవహరించిన క్రిస్ రాక్ ను అతనిపై జరిగిన దాడి విషయంలో ఏమైనా చర్యలు తీసుకుంటారా అని పోలీసులు అడిగారు. అందుకు రాక్ నిరాకరించడం గమనార్హం!
తాజావార్తలు
-
Firing: హర్యానాలో దారుణం.. జిమ్ యజమానిపై బుల్లెట్ల వర్షం.. 5 సెకండ్లలో 10 రౌండ్ల కాల్పులు..
-
AP Schools: ఏపీలో మోగనున్న బడిగంట.. రేపటి నుంచి తెరుచుకోనున్న స్కూళ్లు
-
Pooja Hegde: సీఎంపైనే పూజా హెగ్డే ఆశలు!
-
Heavy Rain Alert: ఏపీపై నైరుతి రుతుపవనాల ప్రభావం.. భారీ వర్షాలు, ఎల్లో అలర్ట్ జారీ
-
Nikhil Chaudhary: కాటేరమ్మ కొడుకు స్థానంలో నిఖిల్ చౌదరి.. రికార్డు అదిరిపోయింది..
ట్రెండింగ్
-
Parenting Tips: డిజిటల్ చెరలో బాల్యం.. రోబోలుగా మారుతున్న పిల్లలు! పేరెంట్స్ ఈ జాగ్రత్తలు తీసుకోండి..
-
8000mAh బ్యాటరీ, 144Hz డిస్ప్లే, 50MP కెమెరాతో Tecno Pova 8 లాంచ్.. ధర ఎంతంటే.?
-
Mohammed Siraj Wedding: హీరోయిన్‌తో మహ్మద్ సిరాజ్ పెళ్లి.. జూన్‌లోనే ముహూర్తం!
-
Ben Stokes: ఇంగ్లండ్ క్రికెట్లో కీలక పరిణామం.. బెన్ స్టోక్స్‌కు భారీ షాక్!
-
30 రోజుల బ్యాటరీ, ఆఫ్‌లైన్ మ్యాప్స్‌తో Cheetah 2 Pro, Cheetah 2 Ultra భారత్‌లో లాంచ్..!