Meena: పాప ఉన్నా పర్లేదు.. మీనాను పెళ్లి చేసుకుని లైఫ్ ఇస్తా.. సినీ క్రిటిక్ నోటి దురద వ్యాఖ్యలు!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Will Marry meena Says Santhosh Varkey:తనని సంతోష్ వర్కీ అనే వ్యక్తి ఆరేళ్లుగా ప్రేమ పేరుతొ వేధించాడని నటి నిత్యా మీనన్ చేసిన కామెంట్స్ అందరికీ గుర్తుండే ఉంటాయి. సంతోష్ వర్కీ అనే అతను తనను ఓ 30 రకాల ఫోన్ నెంబర్లతో ఫోన్ చేసి విసిగిస్తూ, వేధించాడని, ఆరేళ్లపాటు నరకం చూశాను అంటూ కామెంట్స్ చేసింది. ఇక ఆ తరువాత మోహన్‌లాల్ నటించిన ఆరత్‌ని సమీక్షించినందుకు సంతోష్ వర్కి మలయాళీలలో ఫేమస్ అయ్యాడు. అప్పటి నుంచి ఒక ఫిలిం క్రిటిక్ గా మారిపోయి సినిమాలకి రివ్యూలు ఇస్తున్నారు. ఆరత్ అన్నన్‌గా పేరుగాంచిన సంతోష్ వర్కి తరచూ వివాదాల్లో కూరుకుపోతుంటారు. నటి నిత్యా మీనన్‌కి సంబంధించిన వివాదాల తర్వాత, సంతోష్ వర్కిపై చాలా మంది అనేక ఆరోపణలు చేశారు. నిత్యా మీనన్‌ని పెళ్లి చేసుకోవడానికి ఆసక్తిగా ఉన్నట్టు సంతోష్ వర్కి చాలా చోట్ల చెప్పాడు. ఈ క్రమంలో నిత్యా మీనన్ తనపై విమర్శలు చేయడంతో, సంతోష్ వర్కి క్షమాపణలు చెప్పాడు.
Priyamani : ఆ మూవీ షూటింగ్ సమయంలో వాష్ రూమ్స్ లేవు..అలా చేయాల్సి వచ్చింది..
Also Read
- The Paradise: నాని 'ది ప్యారడైజ్' టికెట్ రేట్ల భారీ పెంపు.. అసలు నిజమిదే!
- Ramayana : 'జై జై రామ్' పాట.. ఎందుకిలా చేస్తున్నారు?
- Mahesh Babu: రెండే సినిమాలు అన్నారు.. 15 ఏళ్లు వెయిట్ చేశా.. ఆసక్తికర విషయాలు చెప్పిన మహేష్ బాబు!
- The Paradise: యూట్యూబ్ ని షేక్ చేస్తున్న 'ఏష నాగుల' సాంగ్.. 17 రోజుల్లోనే 100 మిలియన్ వ్యూస్!
అయితే దీని తర్వాత కూడా మళ్లీ సినీ నటీమణులకు సంబంధించిన వివాదాలు తలెత్తాయి. తనకు నటి నిఖిలా విమల్ అంటే ఇష్టమని, ఆమెను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నానని కూడా ఆ మధ్య సంతోష్ వర్కి తెలిపారు. తర్వాత, మోనిషా మోహన్ మీనన్, ఐశ్వర్య లక్ష్మీ, మంజు వారియర్, నటుడు కమల్ హాసన్ కుమార్తె అక్షర హాసన్ మొదలైన వారిని వివాహం చేసుకోవడానికి తాను ఆసక్తిగా ఉన్నానని సంతోష్ వర్కి చెప్పడం విమర్శలకు దారి తీసింది. ఇప్పుడు మళ్లీ అదే తరహాలో సంతోష్ వర్కి తెరపైకి వచ్చారు. సంతోష్ వర్కి తాజా వీడియోలో నటి మీనా గురించి మాట్లాడారు. ఈ మధ్యనే భర్తను కోల్పోయిన నటి మీనాకు జీవితాన్ని ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నానని సంతోష్ వర్కి తెలిపారు. మంజు వారియర్ లాగే మీనా చాలా మంచి అమ్మాయి. మీనాకు జీవితాన్ని ఇవ్వడానికి తాను సిద్ధంగా ఉన్నానని, మీనాకు కుమార్తె ఉండటం తనకు ఇబ్బంది కాదని సంతోష్ వర్కి తెలిపారు. అదే సమయంలో, చాలా మంది వీడియో కింద సంతోష్ వర్కీని విమర్శించారు. పబ్లిసిటీ కోసం ఇంత చీప్ గా ఉండకూడదని చాలా మంది అంటున్నారు.
తాజావార్తలు
-
LV Prasad Hospital: అమరావతిలో ఎల్.వి.ప్రసాద్ కంటి ఆసుపత్రి.. 12 ఎకరాల స్థలంలో నిర్మాణం..
-
Trump: ట్రంప్ దౌత్యం విఫలం.. మరోసారి ఇంధన వసతులపై రష్యా-ఉక్రెయిన్ పరస్పర దాడులు
-
TGTET ఇన్‌సర్వీస్ కీ విడుదల.. అభ్యంతరాలకు ఇదే చివరి ఛాన్స్.!
-
The Paradise: నాని ‘ది ప్యారడైజ్’ టికెట్ రేట్ల భారీ పెంపు.. అసలు నిజమిదే!
-
Agni veer Rally: సైనిక కల కల్లైంది.. విశాఖ అగ్నివీర్ ర్యాలీలో విషాద ఛాయలు..
ట్రెండింగ్
-
OnePlus N6 Lite: 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో సెప్టెంబర్ 22న రానున్న అదిరిపోయే ఫోన్..!
-
Redmi Note 17 Pro: 9,000mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్‌ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో లాంచ్.!
-
Redmi Note 17 Pro Max: 10,000mAh బ్యాటరీ, 50MP OIS కెమెరా, 1.5K AMOLED డిస్ప్లేతో లాంచ్.!
-
Jowar vs Ragi: జొన్న VS రాగి.. ఆరోగ్యానికి ఏది బెటర్?
-
iPhone 18 Pro Max vs Samsung Galaxy S26 Ultra: డిస్‌ప్లే, బ్యాటరీ, కెమెరా, ఫీచర్స్.. ఏది బెస్ట్ మొబైల్.?