Rahul Ramakrishna: అలాంటి పాత్రలు చేయడం ఇష్టం లేదు.. విజయ్ దేవరకొండ నా కాల్స్ తీసుకోవడం మానేశాడు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Rahul Ramakrishna: తెలుగు సినీ పరిశ్రమలో విలక్షణమైన కామెడీ, డైలాగ్ డెలివరీతో గుర్తింపు తెచ్చుకున్న నటుడు రాహుల్ రామకృష్ణ. రచయిత, జర్నలిస్ట్ అయిన రామకృష్ణ ప్రయాణం 2016లో ‘జయమ్ము నిశ్చయమ్ము రా’తో నటుడిగా మొదలైంది. ఆతరువాత 2017లో వచ్చిన బ్లాక్‌బస్టర్ సినిమా ‘అర్జున్ రెడ్డి’లో ‘శివ’ పాత్ర ఆయన కెరీర్‌ను మలుపు తిప్పింది. ఆ తర్వాత ‘గీత గోవిందం’, ‘బ్రోచేవారెవరురా’, ‘జాతి రత్నాలు’, ‘ఆర్ఆర్ఆర్ (RRR)’ ‘ఓం భీమ్ బుష్’ వంటి ఎన్నో హిట్ సినిమాలలో కీలక పాత్రలు పోషించి మెప్పించారు. నటుడిగానే కాకుండా పలు సినిమాలకు పాటల రచయితగా, స్క్రీన్‌ప్లే రైటర్‌గా కూడా పనిచేస్తూ బహుముఖ ప్రజ్ఞను చాటుకుంటున్నారు.
అయితే ‘అర్జున్ రెడ్డి’ సినిమాలో విజయ్ దేవరకొండకు స్నేహితుడిగా శివ పాత్రలో నటించి ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యారు రాహుల్ రామకృష్ణ. ఈ సినిమాలో విజయ్, రాహుల్ మధ్య నడిచే ఫ్రెండ్ షిప్ అప్పట్లో ఎంతగా ఆకట్టుకుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే ఆ తర్వాత వీరిద్దరూ అలాంటి కాంబినేషన్లో పెద్దగా కనిపించలేదు. తాజాగా రాహుల్ రామకృష్ణ ఓ ఇంటర్వ్యూలో కొన్ని ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. సినీ విమర్శకుడు భరద్వాజ్ రంగన్‌తో జరిగిన ఓ ఇంటర్వ్యూలో రాహుల్ రామకృష్ణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా విజయ్ దేవరకొండ మళ్లీ ఫోన్ చేసి తన సినిమాలో హీరోకి ఫ్రెండ్ క్యారెక్టర్ ఇస్తే నటిస్తారా అని ఆయనను ప్రశ్నించారు. దీనికి రాహుల్ తనదైన శైలిలో సమాధానం ఇచ్చారు. తాను చాలాసార్లు ఆ తరహా పాత్రలను చేయడానికి నిరాకరించడంతో విజయ్ దేవరకొండ తన కాల్స్‌కు సమాధానం ఇవ్వడం మానేశాడని నవ్వుతూ చెప్పారు.
Also Read
- Ajith Kumar: అజిత్‌తో రాజమౌళి అసిస్టెంట్ సినిమా?.. భారీ పాన్ ఇండియా ప్లాన్!
- Theaters issue : ఈ వారమే థియేటర్ వార్‌కు అసలు పరీక్ష.. డిస్ట్రిబ్యూషన్ పవరా? ప్రేక్షకుల డిమాండా?
- Alpha OTT: అలియా భట్ స్పై యాక్షన్ థ్రిల్లర్ ‘ఆల్ఫా’ ఓటీటీ రిలీజ్ ఫిక్స్.. ఎక్కడ, ఎప్పటి నుంచి చూడొచ్చంటే?
- No Release Date : ఈ సినిమాలు వచ్చేది ఎప్పుడు.. అసలు వస్తాయా?
అయితే రాహుల్ వ్యాఖ్యలను చూస్తే వీరిద్దరి మధ్య ఏదైనా విభేదాలు ఉన్నట్లు మాత్రం కనిపించడం లేదు. హీరోకు స్నేహితుడిగా, సహాయక పాత్రల్లో పదేపదే కనిపించడం తనకు ఇష్టం లేదనే విషయాన్ని ఆయన కామెడిగా చెప్పినట్లు అర్థమవుతోంది. ‘అర్జున్ రెడ్డి’లో శివ పాత్ర రాహుల్ రామకృష్ణకు మంచి గుర్తింపు తీసుకురావడంతో పాటు, విజయ్ దేవరకొండతో ఆయన స్నేహం ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అయింది. 2017లో విడుదలైన ‘అర్జున్ రెడ్డి’ తెలుగు సినిమా ట్రెండ్‌ను మార్చిన చిత్రాల్లో ఒకటిగా నిలిచింది. సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో విజయ్ దేవరకొండ, షాలినీ పాండే ప్రధాన పాత్రల్లో నటించగా, రాహుల్ రామకృష్ణ పోషించిన శివ పాత్ర కథలో కీలకంగా నిలిచింది. హీరో జీవితంలోని ఒడిదుడుకుల్లో అతనికి తోడుగా ఉండే స్నేహితుడిగా రాహుల్ నటన ప్రేక్షకులను ఆకట్టుకుంది.
ఇదే ఇంటర్వ్యూలో రాహుల్ రామకృష్ణ టాలీవుడ్లో పెరుగుతున్న భారీ బడ్జెట్ సినిమాలపై కూడా ఆసక్తికరమైన అభిప్రాయాలను వెల్లడించారు. ‘బాహుబలి’, ‘ఆర్ఆర్ఆర్’, ‘పుష్ప’ వంటి సినిమాలు తెలుగు సినిమాకు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తీసుకొచ్చిన విషయం తెలిసిందే. దీంతో భారీ బడ్జెట్, పాన్ ఇండియా కథలపై నిర్మాతలు ఎక్కువగా దృష్టి పెట్టడం మొదలైంది. అయితే ప్రతి సినిమా భారీ స్థాయిలో నిర్మిస్తే విజయం సాధిస్తుందనే గ్యారెంటీ లేదని రాహుల్ అభిప్రాయపడ్డారు. సినిమా బడ్జెట్ ఎంత అన్నది కంటే, ప్రేక్షకులను ఎంతగా అలరించగలిగింది అన్నదే ముఖ్యమని ఆయన పేర్కొన్నారు. రూ.75 లక్షలతో సినిమా తీసినా, వేల కోట్ల రూపాయలతో సినిమా తీసినా చివరకు ప్రేక్షకుడిని ఎంటర్టైన్ చేయడమే సినిమాకు అసలు లక్ష్యమని తన అభిప్రాయాన్ని స్పష్టం చేశారు. భారీ సెట్లు, విజువల్స్, భారీ యాక్షన్ సీక్వెన్స్ సినిమాకు హంగులు ఇవ్వొచ్చని, అయితే అవి మంచి కథకు ప్రత్యామ్నాయం కాలేవని రాహుల్ స్పష్టం చేశారు. దీంతో ప్రస్తుతం ఆయన చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
మరోవైపు విజయ్ దేవరకొండ వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. రాహుల్ రామకృష్ణ కూడా విభిన్నమైన పాత్రలను ఎంచుకుంటూ తన కెరీర్‌ను కొనసాగిస్తున్నారు. అయితే ‘అర్జున్ రెడ్డి’ కాంబినేషన్‌ను ఇష్టపడిన అభిమానులు మాత్రం ఈ ఇద్దరు నటులు మరోసారి అలాంటి స్నేహితుల పాత్రల్లో కనిపిస్తే చూడాలని కోరుకుంటున్నారు. మరి భవిష్యత్తులో విజయ్, రాహుల్ కాంబినేషన్ మళ్లీ తెరపై కనిపిస్తుందా అనేది చూడాలి.
- Tags
- cinema
- Rahul Ramakrishna
తాజావార్తలు
-
Rahul Ramakrishna: అలాంటి పాత్రలు చేయడం ఇష్టం లేదు.. విజయ్ దేవరకొండ నా కాల్స్ తీసుకోవడం మానేశాడు..
-
IP Ratings: IP67, IP68, IP69 అంటే ఏమిటి? స్మార్ట్‌ఫోన్ కొనేముందు ఈ వాటర్‌ప్రూఫ్ రేటింగ్స్ గురించి తప్పక తెలుసుకోండి.!
-
Ajith Kumar: అజిత్‌తో రాజమౌళి అసిస్టెంట్ సినిమా?.. భారీ పాన్ ఇండియా ప్లాన్!
-
Theaters issue : ఈ వారమే థియేటర్ వార్‌కు అసలు పరీక్ష.. డిస్ట్రిబ్యూషన్ పవరా? ప్రేక్షకుల డిమాండా?
-
Monday Horoscope: వ్యాపారంలో లాభాలు, ఉద్యోగంలో ప్రమోషన్లు ఎవరికి..? నేటి ద్వాదశ రాశుల పూర్తి సమాచారం ఇలా.!
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi: 8 పరుగులకే ఔట్.. అరంగేట్రంలోనే వైభవ్ సూర్యవంశీ అట్టర్ ఫ్లాఫ్!
-
Home Remedies: వర్షాకాలంలో ఇంట్లో జెర్రులు, దోమలు, చీమలు, నల్లులకు చెక్ పెట్టే చిట్కాలు ఇవే!
-
Home Safety Tips: పాములను ఇంట్లోకి రాకుండా తరిమికొట్టే చిట్కాలు ఇవే.. ఈ జాగ్రత్తలు తీసుకోండి..
-
Maharashtra: “ఇది కదా విశ్వాసం అంటే”.. యజమానులు తిరిగిరారని తెలియక.. తిండి, నీళ్లు మానేసిన పెంపుడు కుక్క
-
Karnataka: పెళ్లి కొడుకు రాహుల్ గాంధీ ఫ్యాన్.. పెళ్లి క్యాన్సల్ చేసిన యువతి? షాకింగ్ కారణం!