Site icon NTV Telugu

Beast: తెలుగు వారంటే అంత చులకనా.. విజయ్..?

vijay

vijay

కోలీవుడ్ స్టార్ హీరో విజయ్, పూజా హెగ్డే జంటగా నటించిన చిత్రం బీస్ట్. నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఏప్రిల్ 13 న విడుదల  కానున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా తమిళ్ తో పాటు తెలుగు, ఇతర భాషల్లో కూడా రిలీజ్ అవుతుంది. దీంతో మేకర్స్ అన్ని చోట్లా ప్రమోషన్స్ మొదలుపెట్టేశారు. అయితే విజయ్ మాత్రం కోలీవుడ్ కి మాత్రమే ప్రమోషన్స్ చేస్తున్నాడట. తెలుగు ప్రమోషన్స్ కి అటెండ్ అవ్వనని చెప్తున్నాడట. దీంతో విజయ్ మాట కాదనలేక డైరెక్టర్ నెల్సన్ దిలీప్ కుమార్, హీరోయిన్ పూజా హెగ్డేతో తెలుగు ప్రమోషన్స్ మొదలుపెట్టారు. దీంతో తెలుగు ప్రేక్షకులు హర్ట్ అవుతున్నారు. విజయ్ కు కోలీవుడ్ లోనే కాకుండా టాలీవుడ్ లో కూడా మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న సంగతి తెలిసిందే.

పోలీసోడు సర్కార్ అదిరింది మాస్టర్ వంటి చిత్రాలకు తెలుగులో మంచి వసూళ్లు దక్కాయి. దీంతో  బీస్ట్ సినిమాపై కూడా తెలుగు అభిమానులు భారీగానే అంచనాలు పెట్టుకున్నారు. అంతటి అభిమానం చూపిస్తున్నా కూడా విజయ్ తెలుగువారిని చులకనగా చూస్తున్నాడని అభిమానులు అసహనం వ్యక్తం చేస్తున్నారు.  ఇతర భాషలకు చెందిన హీరోలు తెలుగులో తమ సినిమా రిలీజ్ అవుతోందంటే ఖచ్చితంగా ప్రమోషన్స్ కోసం ఉభయ తెలుగు రాష్ట్రాల్లో పర్యటిస్తున్న తరుణంలో విజయ్ ప్రమోషన్స్ కి రాను అని చెప్పడం తెలుగు వారిని అవమానించడమే అని వారు అంటున్నారు. ఇక ఇటీవలే తెలుగులో స్ట్రైట్ ఫిల్మ్ చేస్తున్న సంగతి తెలిసిందే. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో విజయ్ సరసన రష్మిక నటిస్తోంది. మరి తెలుగు దర్శకుడితో సినిమా చేస్తున్నా విజయ్ ఇలా చేయడం పద్దతి కాదని పలువురు అభిప్రాయపడుతున్నారు. మరి ఇందులో నిజమెంత ఉందో చూడాలి.

 

Exit mobile version