Bollywood : బాలీవుడ్లో సత్తా చాటలేకపోతున్న సౌత్ స్టార్స్.. ఇక్కడ టాప్ పొజిషన్.. హిందీలో ఫ్లాపులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సౌత్ ఇండియాలో స్టార్ హోదాను అనుభవిస్తున్న హీరోయిన్లు హిందీ తెరపై మాత్రం తమ మ్యాజిక్‌ను రిపీట్ చేయలేకపోతున్నారు. ఒకప్పుడు శ్రీదేవి, జయప్రద వంటి నటీమణులు బాలీవుడ్‌ను చాలా కాలాం ఏలారు. కానీ ప్రస్తుత తరం దక్షిణాది తారలకు అక్కడ అడుగుపెట్టడం సులభమైనా సెటిల్ అవ్వడం మాత్రం కత్తిమీద సాములా మారింది. స్టార్ ఇమేజ్ ఉన్నప్పటికీ హిందీలో వరుస ఫ్లాపులు పలకరిస్తుండటం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
ఫిదా బ్యూటీ సాయి పల్లవి బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. అమీర్ ఖాన్ కుమారుడు జునైద్ ఖాన్ సరసన ఆమె నటించిన ‘ఏక్ దిన్’ చిత్రం మే 1, 2026న విడుదలైంది. అయితే ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఘోరంగా విఫలమైంది. మొదటి మూడు రోజుల్లో ఈ చిత్రం కనీసం రూ. 3 కోట్ల రూపాయల వసూళ్లను కూడా రాబట్టలేకపోయింది. క్రిటిక్స్ సాయి పల్లవి నటనను మెచ్చుకున్నప్పటికీ కమర్షియల్‌గా ఈ సినిమా డిజాస్టర్‌గా నిలిచింది. చందమామ కాజల్ అగర్వాల్ దక్షిణాదిలో ఎన్నో ఏళ్లుగా స్టార్‌గా ఉన్నప్పటికీ హిందీలో మాత్రం సరైన బ్రేక్ దక్కించుకోలేకపోయింది. అజయ్ దేవగన్ సరసన ‘సింగం’ వంటి హిట్ ఉన్నా ఆ క్రేజ్ నిలవలేదు. ప్రస్తుతం కాజల్ ‘ది ఇండియా స్టోరీతో పాటు ‘రామాయణ్‘ చిత్రాలతో తన అదృష్టాన్ని పరీక్షించుకుంటోంది. ఇక చెన్నై చిన్నది త్రిష పరిస్థితి కూడా భిన్నంగా లేదు. అక్షయ్ కుమార్ సరసన ‘కట్టా మీటా’తో ఎంట్రీ ఇచ్చి ఆ ఒక్క సినిమాతోనే బాలీవుడ్‌కు దూరమైంది. బుట్టబొమ్మ పూజా హెగ్డేకు హిందీలో హృతిక్ రోషన్, సల్మాన్ ఖాన్ వంటి స్టార్లతో నటించే అవకాశం వచ్చినా ‘మొహెంజదారో’, ‘కిసీ కా భాయ్ కిసీ కీ జాన్’ వంటి చిత్రాలు ఫ్లాప్ అవ్వడం ఆమె కెరీర్‌పై ప్రభావం చూపింది. తమన్నా, శ్రియ శరణ్ వంటి నటీమణులు బాలీవుడ్లో పదే పదే ప్రయత్నిస్తున్నా.. అక్కడ ‘స్టార్’ హోదాను మాత్రం అందుకోలేకపోతున్నారు. కేవలం సపోర్టింగ్ రోల్స్ లేదా చిన్న సినిమాలకే పరిమితమవుతున్నారు
Also Read
తాజావార్తలు
-
Sircilla Paddy Scam : ప్రభుత్వ ధాన్యానికి టోకరా.. నకిలీ రికార్డులతో రూ.91 లక్షలు లూటీ..!
-
Meloni-Trump: ముందు మీ ప్రజాదరణ చూసుకోండి.. ట్రంప్‌పై మరోసారి మెలోని తీవ్ర ఆగ్రహం
-
Fathers Day: వెన్నుతట్టి నడిపించే ధైర్యం ‘నాన్న’.. ఫాదర్స్ డే (జూన్ 21) సందర్భంగా బెస్ట్ కొటేషన్స్ మీ కోసం..
-
IND Vs AFG: సెంచరీతో వీరవిహారం చేసిన యశస్వి జైస్వాల్.. క్లీన్‌స్వీప్ చేసిన టీమిండియా..
-
Iran vs US: హర్మూజ్ జలసంధి మళ్లీ మూత.. ఇరాన్ సంచలన ప్రకటన..
ట్రెండింగ్
-
Black Umbrella Benefits: ఎక్కువగా నల్ల గొడుగే ఎందుకు కొంటారు.? అసలు సీక్రెట్ ఇదే.!
-
Kitchen Tips : అల్లం వెల్లుల్లి పేస్ట్ వాసన వస్తోందా..? నెలల తరబడి ఫ్రెష్‌గా ఉండాలంటే ఇలా చేయండి.!
-
Rainy Season Tips : ఉరుములు, మెరుపులతో కూడిన వర్షమా? ఇంట్లోనూ ఈ 5 చిన్న తప్పులు అస్సలు చేయకండి.!
-
Health Tips : షుగర్ కంట్రోల్‌కు నేరేడు గింజల చిట్కా..! ఇలా సింపుల్‌గా చేసుకోండి..!
-
Vaibhav Sooryavanshi: ఫైనల్లో వైభవ్‌ను టార్గెట్ చేస్తారా?.. శ్రీలంక కెప్టెన్ ఆసక్తికర సమాధానం!