ఇండియన్ సినిమా స్థాయిని పెంచిన దర్శకుడు రాజమౌళి… జక్కన్నగా తెలుగు ఆడియన్స్ కి పరిచయమైన రాజమౌళి, ఈరోజు వరల్డ్ టాప్ డైరెక్టర్స్ లో ఒకడిగా పేరు తెచ్చుకున్నాడు. మన సినిమా బౌండరీలు దాటించిన రాజమౌళి తెరకెక్కించిన సినిమాల్లో హీరోలు చాలా స్ట్రాంగ్ గా, విలన్స్ అంతకన్నా స్ట్రాంగ్ గా ఉంటారు. అందుకే ఈ క్యారెక్టర్స్ కి ఆడియన్స్ ఎక్కువగా కనెక్ట్ అవుతూ ఉంటారు. రాజమౌళి హీరోలు కోట్ల వర్షం కురిపిస్తూ ఉంటారు, దేశాలు దాటి అభిమానులని సంపాదించుకుంటారు కానీ నేషనల్ అవార్డ్స్ జ్యూరీ మనసు మాత్రం గెలుచుకోలేకపోతున్నారు. ఇప్పటివరకూ రాజమౌళి సినిమాల్లో నటించిన ఏ హీరోకి కూడా నేషనల్ అవార్డ్ రాలేదు. ఏడేళ్లు కష్టపడి బాహుబలి సినిమా చేసిన ప్రభాస్ 2000 కోట్ల మార్కెట్ రీచ్ అయ్యాడు కానీ నేషనల్ అవార్డుని సొంతం చేసుకోలేకపోయాడు. ఈ మూవీని ప్రభాస్ నమ్మి అంత టైం కేటాయించకపోయి ఉంటే ఈరోజు ఇండియన్ సినిమా ఇలా ఉండేది కాదేమో.
ప్రభాస్ కి కాకపోయినా భల్లాలదేవగా నటించిన రానా, శివగామి దేవిగా నటించిన రమ్యకృష్ణకి అయినా నేషనల్ అవార్డ్స్ రావాల్సింది కానీ వీళ్లకి కూడా అవార్డ్స్ రాలేదు. ఆర్ ఆర్ ఆర్ సినిమా ఆస్కార్ గెలిచింది… ఈ సినిమాలో చరణ్ అండ్ ఎన్టీఆర్ ప్రాణం పెట్టి నటించారు. కొమురం భీమ్ గా ఎన్టీఆర్, అల్లూరి సీతారామరాజుగా రామ్ చరణ్ వెస్టర్న్ ఆడియన్స్ తో కూడా జేజేలు కొట్టించుకున్నారు కానీ నేషనల్ అవార్డుని మాత్రం సొంతం చేసుకోలేకపోయారు. బెస్ట్ యాక్టర్ కేటగిరీలోనే కాదు సై సినిమాలో రాజీవ్ కనకాల బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్ అవార్డ్ వర్త్ పెర్ఫార్మెన్స్ ఇచ్చాడు. ఈగ సినిమాలో కనిపించని ఈగని ఊహించుకోని మరీ పెర్ఫార్మెన్స్ ఇచ్చిన సుదీప్ కి నేషనల్ అవార్డ్ తప్పకుండా ఇవ్వాల్సింది కానీ అవార్డ్ రాలేదు. ఇలా ఒకటేంటి రాజమౌళి హీరోలకి, విలన్లకి మాత్రమే ఈ శాపం ఎందుకో అర్ధం కాదు, ఇది ఎప్పుడు బ్రేక్ అవుతుందో కూడా తెలియదు.