Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి-అనిల్ రావిపూడి కాంబినేషన్ లో వస్తున్న మన శంకర వర ప్రసాద్ గారు మూవీ టైటిల్ గ్లింప్స్ నేడు అనౌన్స్ చేశారు. ముందు నుంచి ప్రచారంలో ఉన్న పేరునే ఫిక్స్ చేశారు. ఈ గ్లింప్స్ లో చిరు వింటేజ్ లుక్ లో కనిపించారు. సూట్ వేసుకుని చుట్టూ పది మంది బాడీగార్డులతో స్టైల్ గా సిగరెట్ తాగుతూ కనిపించారు. ఇది చూసిన వారంతా చిరును వావ్ అంటూ పొగిడేస్తున్నారు. అయితే ఈ సినిమాకు టైటిల్ గా చిరు అసలు పేరును టైటిల్ గా ఎందుకు పెట్టారనేది పెద్ద చర్చ జరుగుతోంది. మనకు తెలిసిందే గదా.. చిరంజీవి అసలు పేరు శివశంకర వర ప్రసాద్ అని. ఇండస్ట్రీలోకి వచ్చాక ఆయన పేరును చిరంజీవిగా మార్చుకున్నారు. ఈ టైటిల్ విషయంపౌ తాజాగా నిర్వహించిన గ్లింప్స్ ఈవెంట్ లో అనిల్ క్లారిటీ ఇచ్చారు.
Read Also : Chiranjeevi-Balakrishna : చిరు, బాలయ్య మల్టీస్టారర్ అప్పుడే.. అనిల్ రావిపూడి క్లారిటీ
ఈ సినిమా విషయంలో అన్నీ నేను తీసుకున్న నిర్ణయాలే. చిరంజీవి గారి లుక్ దగ్గరి నుంచి కాస్ట్యూమ్స్, పాత్రలు, అన్నీ నేనే డిజైన్ చేశా. నేను చెప్పినట్టుగానే చిరంజీవి తన లుక్స్ ను పూర్తిగా కష్టపడి మార్చుకున్నారు. అదే నాకు చాలా పెద్ద సంతోషం. ఈ సినిమాలోని పాత్రకు ఆయన ఒర్జినల్ పేరునే పెట్టాలని ముందు నుంచే అనుకున్నాను. దానికి చిరంజీవి కూడా ఒప్పుకున్నారు. వేరే పేరు పెట్టడం ఎందుకు అని అదే పెట్టేశాం. అంతకు మించి ఇందులో ఏమీ లేదు అంటూ తెలిపాడు అనిల్ రావిపూడి. ఆయన చేసిన కామెంట్లు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. ఇక గ్లింప్స్ లో చిరంజీవి వింటేజ్ లుక్ లో కనిపిస్తున్నారు. చాలా రోజుల తర్వాత చిరు మళ్లీ కామెడీ ట్రాక్ సినిమా చేయబోతున్నారు. అసలే చిరంజీవికి కామెడీ టైమింగ్ బాగా సెట్ అవుతుంది.
Read Also : Hero Dharma : బిగ్ బాస్ ఆర్టిస్టులతో హీరో అక్రమ సంబంధాలు.. భార్య ఆరోపణలు
