మహేశ్ బర్త్ డే బ్లాస్టర్ లీక్ చేసింది ఎవరు?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మహేష్ బాబు పుట్టిన రోజు సందర్భంగా విడుదలైన ‘సర్కారు వారి పాట’ బర్త్ డే బ్లాస్టర్ యు ట్యూబ్ ను షేక్ చేసింది. సర్కారు వారి బ్లాస్టర్ అభిమానులనే కాదు.. సాధారణ ప్రేక్షకులను కూడా విశేషంగా ఆకట్టుకుంది. దీంతో టాలీవుడ్ లో రికార్డ్ క్రియేట్ చేసింది. విడుదలైన 24 గంటల్లో 25.7 మిలియన్ వ్యూస్ సాధించి మొదటి స్థానంలో నిలిచింది. అలాగే 754K లైక్స్ కూడా రాబట్టడం విశేషం. కీర్తి సురేష్ హీరోయిన్ గా పరశురామ్ దర్శకత్వంలో వస్తున్న ‘సర్కారు వారి పాట’ను మైత్రి మూవీస్ సంస్థ నిర్మిస్తోంది. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 13న రిలీజ్ కాబోతుంది.
నిజానికి ఈ బ్లాస్టర్ మహేశ్ బాబు పుట్టిన రోజు కానుకగా ఆగష్టు 9 ఉదయం 9 గంటల 9 నిమిషాలకు విడుదల చేయాలని చిత్ర యూనిట్ ప్లాన్ చేసింది. కానీ అనుకున్న టైమ్ కంటే తొమ్మిది గంటలు ముందుగా అర్ధరాత్రి టీజర్ ఆన్‌లైన్‌లో దర్శనం ఇవ్వడంతో బేజారైన యూనిట్ చేసేది ఏమీ లేక ప్రకటించిన టైమ్ కంటే ముందే అర్థరాత్రి 12:30 గంటలకు అధికారికంగా విడుదల చేసింది. అయితే టీజర్ ముందుగానే లీక్ కావడాన్ని యూనిట్ సీరియస్‌గా తీసుకుని… ఈ పని ఇంటి దొంగలే చేసి ఉంటారని అనుమానిస్తూ, చేసింది ఎవరో కనిపెట్టే ప్రయత్నాల్లో ఉంది. అంతేకాదు దీనిపై సైబర్ క్రైమ్ పోలీసులకు కూదా ఫిర్యాదు చేసింది. మరి బ్లాస్టర్ లీక్ ఇంటి దొంగల పనా? లేకా వేరే ఎవరైనా చేశారా? అన్నది తేలాల్సి ఉంది. ఏది ఏమైనా అనుకున్నటైమ్ కంటే ముందే రిలీజ్ చేసినా రికార్డ్ వ్యూస్ దక్కించుకోవడం విశేషమే. మహేశ్ ఫ్యాన్సా… మజాకా!?
Also Read
- Peddi Censor Report: ‘పెద్ది’కి U/A సర్టిఫికేట్.. కానీ ఈ సీన్లపై సెన్సార్ కత్తెర
- Rukmini Vasanth: AI డీప్‌ఫేక్ బికినీ వీడియో పై..క్లారిటీ ఇచ్చిన రుక్మిణి వసంత్
- Swayambhu: ‘బాహుబలి’, ‘ఆర్ఆర్ఆర్’ తర్వాత భారీ గ్రాఫిక్స్‌తో వస్తున్న నిఖిల్ మూవీ
- Lenin: అఖిల్ కంబ్యాక్ ఫిక్స్?.. “మనోడు వస్తున్నాడు” టీజర్ వైరల్
తాజావార్తలు
-
Pregabalin: ప్రెగాబాలిన్ దుర్వినియోగంపై కేంద్రం అలర్ట్.. అమ్మకాలపై ఆరోగ్యశాఖ ఆంక్షలు
-
Arava Sridhar Resignation: ఎమ్మెల్యే అరవ శ్రీధర్‌తో పవన్ కల్యాణ్ భేటీ.. పదవికి రాజీనామా..
-
Peddi Censor Report: ‘పెద్ది’కి U/A సర్టిఫికేట్.. కానీ ఈ సీన్లపై సెన్సార్ కత్తెర
-
Dahi Masala Khichdi Recipe: వేసవిలో చల్లదనం ఇచ్చే దహీ మసాలా కిచిడి.. రుచితో పాటు ఆరోగ్యానికి మేలు చేస్తుంది..
-
Rukmini Vasanth: AI డీప్‌ఫేక్ బికినీ వీడియో పై..క్లారిటీ ఇచ్చిన రుక్మిణి వసంత్
ట్రెండింగ్
-
150కి పైగా స్పోర్ట్స్ మోడ్స్, 9.7mm మందం, 21 రోజుల బ్యాటరీ లైఫ్‌తో Xiaomi Band 10 Pro లాంచ్..!
-
IP69 ప్రో-లెవెల్ వాటర్ రెసిస్టన్స్, 8000mAh భారీ బ్యాటరీ, 144Hz డిస్ప్లేతో Realme 16T 5G లాంచ్.. ధర ఎంతంటే?
-
ప్రీమియం డిజైన్, 50MP Sony కెమెరా, 144Hz AMOLED డిస్ప్లే తో Motorola Edge 70 Pro+..!
-
705Km రేంజ్‌తో Xiaomi YU7 GT ఎలక్ట్రిక్ SUV.. ఫీచర్లు చూస్తే మైండ్ బ్లోయింగ్ అవ్వాల్సిందే.!
-
అదిరిపోయే ఫీచర్లు తక్కువ ధరలోనే.. IP55 రేటింగ్, 50 గంటల బ్యాటరీ బ్యాకప్, 55dB ANCతో Realme Buds Air 8 Pro లాంచ్.!