2023 సంక్రాంతికి వాల్తేరు వీరయ్య సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాడు మెగాస్టార్ చిరంజీవి. ఆచార్య, గాడ్ ఫాదర్ సినిమాల రిజల్ట్ తేడా కొట్టడంతో చిరుపై కొందరు నెగటివ్ కామెంట్స్ చేసారు. ఈ కామెంట్స్ కి ఎండ్ కార్డ్ వేస్తూ చిరు వీరయ్యగా మెగా అభిమానులనే కాకుండా మూవీ లవర్స్ అందరినీ మెప్పించాడు. ఈ హిట్ స్ట్రీక్ కంటిన్యూ అవుతుంది అనుకుంటే చిరుకి, మెగా ఫ్యాన్స్ కి షాక్ ఇస్తూ మెహర్ రమేష్ ‘భోళా శంకర్’ సినిమాతో ఊహించని ఫ్లాప్ ఇచ్చాడు. ఈ మూవీ మళ్లీ చిరుపై మళ్లీ విమర్శలకి కారణం అయ్యింది. నెగటివ్ కామెంట్స్ పెరగడంతో సోషల్ మీడియాలో కొందరు చిరు సపోర్ట్ గా ట్వీట్స్ కూడా చేసారు. ఇదిలా ఉంటే అసలు చిరు నెక్స్ట్ సినిమా ఎవరితో చేయబోతున్నాడు అనే విషయంలో కంప్లీట్ గా కన్ఫ్యూజన్ ఉంది. భోళా శంకర్ హిట్ అయ్యి ఉంటే తన ప్లాన్ ప్రకారం చిరు, కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో సినిమా చేసే వాడు. భోళా రిజల్ట్ కారణంగా చిరు, కళ్యాణ్ కృష్ణ సినిమాని హోల్డ్ చేసాడు అనే టాక్ ఇండస్ట్రీలో వినిపిస్తోంది.
కళ్యాణ్ కృష్ణ స్థానంలోకి మురుగదాస్ వచ్చాడని… మెగాస్టార్-మురుగదాస్ కాంబినేషన్ లో సినిమా ఉంటుందనే మాట గత కొన్ని రోజులుగా ఎక్కువగా వినిపిస్తోంది. బింబిసారాతో సూపర్ హిట్ కొట్టిన వశిష్ట కూడా చిరుతో సినిమా చేయడానికి రెడీగా ఉన్నాడు. ఈ కాంబినేషన్ దాదాపు ఓకే అయ్యింది. మరి కళ్యాణ్ కృష్ణ, వశిష్ట, మురుగదాస్ లలో ఎవరితో మెగాస్టార్ తన నెక్స్ట్ సినిమాని చేస్తాడు అనేది చూడాలి. ఈ విషయంలో మెగా ఫ్యాన్స్ లో కొంత అయోమయం ఉంది కానీ చిరు నెక్స్ట్ ఎవరితో సినిమా చేయబోతున్నాడు అనే విషయంలో ఆగస్టు 22న ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఆ రోజు మెగాస్టార్ బర్త్ డే కావడంతో నెక్స్ట్ సినిమా విషయంలో అఫీషయల్ అనౌన్స్మెంట్ వస్తుంది.