Pawan Kalyan : పవన్ కల్యాణ్ కు రిటర్న్ గిఫ్ట్ ఇచ్చిందెవరు..?
- టాలీవుడ్ లో ఎవరా నలుగురు..?
- ఇప్పుడు ఇదే చర్చ
- పవన్ బయట పెడుతారా..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Pawan Kalyan : థియేటర్ల బంద్ విషయంలో ఎంత రచ్చ జరిగిందో తెలిసిందే. హరిహర వీరమల్లు సినిమాను ఆపడానికే కుట్ర చేశారంటూ పెద్ద ఎత్తున పవన్ ఫ్యాన్స్ ఆరోపణలు చేశారు. చివరకు నిర్మాతల మండలి చర్చలు జరిపి థియేటర్ల మూసివేత ఉండట్లేదని.. యథావిధిగా సినిమాలు ఆడుతాయంటూ నిర్ణయం తీసుకుంది. నిర్మాతల మండలి ఈ ప్రకటన చేసిన కొద్ది క్షణాలకే డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సంచలన ప్రకటన చేశారు. సినిమా ఇండస్ట్రీ గౌరవ, మర్యాదలు కాపాడేందుకు తాము ప్రయత్నిస్తుంటే.. వాళ్లు మాత్రం తనకు రిటర్న్ గిఫ్ట్ ఇస్తున్నారంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.
Read Also : Manchu Vishnu : వాడిని తీసుకోవడమే నేను చేసిన తప్పు.. మంచు విష్ణు కామెంట్స్..
Also Read
వాళ్లు ఇచ్చిన రిటర్న్ గిఫ్ట్ (థియేటర్ల మూసివేత)ను స్వీకరిస్తానని.. భవిష్యత్ లో వ్యక్తిగత సంప్రదింపులు ఉండవని.. ఆయా సంఘాల ప్రతినిధులే రావాలంటూ తేల్చి చెప్పేశారు. టాలీవుడ్ కు ఏపీ ప్రభుత్వం అంటే కనీస గౌరవ, మర్యాదలు లేకుండా పోయాయని సీరియస్ అయ్యారు. ఈ కామెంట్లే ఇప్పుడు దుమారం రేపుతున్నాయి. పవన్ కల్యాణ్ కు రిటర్న్ గిఫ్ట్ ఇవ్వాల్సిన అవసరం ఎవరికి ఉంది అనే చర్చ ఇప్పుడు మొదలైంది. నిర్మాతల మండలి మాత్రం ఒక సినిమాను ఆపేందుకు థియేటర్లు బంద్ చేస్తున్నారని చెప్పడాన్ని ఖండించింది. కానీ పవన్ మాత్రం తన సినిమాను ఆపడానికే ఇలా చేశారని చెప్పకనే చెబుతున్నారు.
కొన్ని రోజులుగా టాలీవుడ్ కు చెందిన నలుగురు బడా నిర్మాతలు హరిహర వీరమల్లు సినిమాపై కుట్ర చేస్తున్నారంటూ ఆరోపణలు వచ్చాయి. ఇప్పుడు పవన్ చేసిన వ్యాఖ్యలు వాటికి ఆజ్యం పోస్తున్నాయి. నిజంగానే వీరమల్లు సినిమాపై కుట్ర జరిగిందా.. పవన్ కల్యాణ్ మీద అంత కక్ష ఎవరికి ఉంటుంది అనే ఆరాలు మొదలయ్యాయి. పవన్ ఇప్పుడు డిప్యూటీ సీఎం. ఆయనతో పెట్టుకునే ధైర్యం ఎవరైనా చేస్తారా.. అసలు రిటర్న్ గిఫ్ట్ ఇచ్చిందెవరు అనేదే ఇప్పుడు అసలైన ప్రశ్న. దానికి సమాధానం ఇప్పుడు పవన్ చెప్పకపోయినా.. భవిష్యత్ లో పవన్ తీసుకునే చర్యలను బట్టి తెలిసే ఛాన్స్ ఉండొచ్చని అంటున్నారు నెటిజన్లు.
Read Also : Pawan Kalyan: టార్గెట్ హరిహర .. డిప్యూటీ సీఎం ఆఫీస్ సంచలన ప్రకటన!
తాజావార్తలు
-
PM Modi: ‘పాలసీ పారాలసిస్’ నుంచి ‘రిఫార్మ్ ఎక్స్‌ప్రెస్’ వరకు.. దేశాభివృద్ధిపై మోడీ కీలక వ్యాఖ్యలు..
-
PM Modi: “2047 నాటికి ‘వికసిత భారతే లక్ష్యం.. We Will Do It..” దేశ ప్రజలకు ప్రధాని మోడీ పిలుపు..!
-
Farmer Marriage Struggles: ఎకరాల కొద్ది భూమి ఉన్నా.. నాకు పెళ్లి కావడం లేదు.. సీఎం దగ్గరకు వెళ్లిన యువ రైతు
-
jailer 2 : జైలర్2 నిండా స్టార్ కాస్ట్ నింపేసిన నెల్సన్ దిలీప్ కుమార్..
-
CCRT Workshop: ఉపాధ్యాయులకు స్వర మాడ్యులేషన్పై ప్రత్యేక శిక్షణ..
ట్రెండింగ్
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!
-
Actors To Directors: టాలీవుడ్లో సరికొత్త ట్రెండ్.! యాక్టర్స్ టు డైరెక్టర్స్.. సొంత కథలతోనే హిట్ ప్లాన్.!
-
Tulsi Care Tips: తులసి మొక్కల పక్కన ఈ ఐదు మొక్కలను అస్సలు నాటొద్దు.. ఎందుకో తెలుసా?
-
Bathroom Tiles Cleaning Tips: హార్పిక్, యాసిడ్ అక్కర్లేదు.. కెమికల్స్ లేకుండానే బాత్రూమ్ టైల్స్‌పై మొండి గార మరకలను సులువుగా తొలగించండి ఇలా.!
-
Bhuvneshwar Kumar 2.O: 36 ఏళ్ల వయసులో రీఎంట్రీ.. భువీ ఊహించని పునరాగమనం వెనుక అసలు కథ ఇదే!