సూపర్ స్టార్ రజినీకాంత్ జైలర్ సినిమాతో సాలిడ్ కంబ్యాక్ ఇచ్చాడు. గత అయిదేళ్లుగా హిట్ లేని రజినీ జైలర్ సినిమాతో ఒకేసారి 650 కోట్లు కలెక్ట్ చేసి తను సూపర్ స్టార్ అని మరోసారి ప్రూవ్ చేసాడు. రజినీ రేంజ్ కంబ్యాక్ ని ఈ మధ్య కాలంలో ఇంకో హీరో ఇవ్వలేదు. ప్రస్తుతం ‘తలైవర్ 170’ సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్న రజినీకాంత్, ఈ సినిమా కంప్లీట్ అవ్వగానే లోకేష్ కనగరాజ్ తో ‘తలైవర్ 171’ సినిమా చేయనున్నాడు. మోస్ట్ ఆంటిసిపేటెడ్ కాంబినేషన్ గా పేరు తెచ్చుకున్న లోకేష్ అండ్ రజినీకాంత్ ప్రాజెక్ట్… కోలీవుడ్ మొదటి వెయ్యి కోట్ల సినిమా అవుతుందని వర్గాలు కాన్ఫిడెంట్ గా ఉన్నాయి. అనౌన్స్మెంట్ తోనే హ్యూజ్ బజ్ ని జనరేట్ చేసిన ఈ ప్రాజెక్ట్ నుంచి డిసెంబర్ 12న రజినీకాంత్ పుట్టిన రోజున అప్డేట్ బయటకి వస్తుందేమోనని తలైవా ఫ్యాన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు.
విక్రమ్, లియో సినిమాలకి లోకేష్ కనగరాజ్ ఒక అనౌన్స్మెంట్ వీడియోకి డిజైన్ చేసాడు. ఈ వీడియోతోనే సినిమాపై ఒక క్లారిటీ వచ్చేది, ఇప్పుడు రజినీకాంత్ ప్రాజెక్ట్ కోసం లోకేష్ ఇలాంటిది చేస్తాడా లేదా అనేది చూడాలి. ఒకవేళ అనౌన్స్మెంట్ వీడియోని డిసెంబర్ 12న రిలీజ్ చెయ్యాలి అంటే లోకేష్ రెండు మూడు రోజుల్లో షూట్ చెయ్యాల్సి ఉంది. అనౌన్స్మెంట్ వీడియో లేకపోయినా ఫస్ట్ లుక్ ని రిలీజ్ చెయ్యాలి అంటే ఒక ఫోటోషూట్ చేసేస్తే సరిపోతుంది. మరి లోకేష్ అనౌన్స్మెంట్ వీడియోతో రజినీ ఫ్యాన్స్ ని థ్రిల్ చేస్తాడా లేక ఫోటోషూట్ చేసి ఫస్ట్ లుక్ ని రిలీజ్ చేస్తాడా అనేది చూడాలి. ఇప్పటికైతే ఈ విషయంలో ఎవరికీ ఎలాంటి క్లారిటీ లేదు.