జూనియర్ ఎన్టీఆర్ ఎంత బాగా డాన్స్ చేస్తాడో మనందరికీ తెలుసు. అలాగే హృతిక్ రోషన్ ఎంత బాగా డాన్స్ చేస్తాడో కూడా తెలుసు. వీరిద్దరితో కలిసి ఒక సినిమా చేస్తున్నారనగానే అందరూ ఇలాంటి ఒక డాన్స్ నెంబర్ ఉంటుందని అనుకున్నారు. అయితే వార్ సినిమా కావడంతో ఆ డాన్స్ నెంబర్‌కి స్కోప్ ఎక్కడ దొరుకుతుందా, అసలు అలాంటిదేమైనా ప్లాన్ చేశారో లేదో అని అనుకున్నారు. కానీ ఫైనల్‌గా ఆ డాన్స్ నెంబర్ ఉందని జూనియర్ ఎన్టీఆర్ చెప్పేశాడు. రేపు డాన్స్ ఫ్లోర్ మీద యుద్ధాన్ని చూస్తారని, రేపు ఈ సాంగ్‌కి సంబంధించిన గ్లిమ్స్ రిలీజ్ చేస్తున్నామని చెప్పుకొచ్చాడు.
Also Read:Tollywood: స్టార్స్ ఎవడికి కావాలిరా… కంటెంట్ ఈజ్ కింగ్ ఇక్కడ
అయితే ఫుల్ సాంగ్ మాత్రం బిగ్ స్క్రీన్ మీదే చూడాలని, 14వ తేదీన హిందీ, తెలుగు, తమిళ భాషల్లో వార్ 2 రిలీజ్ అవుతుందని ఎన్టీఆర్ చెప్పాడు. ఇక పోస్టర్‌లో చూస్తుంటే ఇది ఏదో నైట్ థీమ్ సాంగ్ లాగా కనిపిస్తోంది. చాలామంది ఫారనర్స్ డాన్స్ చేస్తూ కనిపిస్తుండగా, జూనియర్ ఎన్టీఆర్, హృతిక్ రోషన్ ఇద్దరూ నడిచి వస్తూ కనిపిస్తున్నారు. మొత్తం మీద హోరా హోరీగా వీరిద్దరి డాన్స్ వార్ 2లో ఉండబోతుందని చెప్పక తప్పదు. అయితే జూనియర్ ఎన్టీఆర్‌తో పాటు హృతిక్ రోషన్ ట్రీట్ వార్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వీరిద్దరూ తమ సినిమాని ట్విట్టర్, అలాగే ఇతర సోషల్ మీడియా హ్యాండిల్స్‌తో ప్రమోట్ చేస్తున్నారు.