జూనియర్ ఎన్టీఆర్ ఎంత బాగా డాన్స్ చేస్తాడో మనందరికీ తెలుసు. అలాగే హృతిక్ రోషన్ ఎంత బాగా డాన్స్ చేస్తాడో కూడా తెలుసు. వీరిద్దరితో కలిసి ఒక సినిమా చేస్తున్నారనగానే అందరూ ఇలాంటి ఒక డాన్స్ నెంబర్ ఉంటుందని అనుకున్నారు. అయితే వార్ సినిమా కావడంతో ఆ డాన్స్ నెంబర్‌కి స్కోప్ ఎక్కడ దొరుకుతుందా, అసలు అలాంటిదేమైనా ప్లాన్ చేశారో లేదో అని అనుకున్నారు. కానీ ఫైనల్‌గా ఆ డాన్స్ నెంబర్ ఉందని జూనియర్ ఎన్టీఆర్ చెప్పేశాడు.…