ప్రభాస్ తో కలిసి నటించాలనుకుంటున్నారా.. ఇదిగో బంపర్ ఆఫర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టాలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థ వైజయంతి మూవీస్ వారు బంపర్ ఆఫర్ ఇచ్చారు. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తో నటించే అవకాశం కల్పించారు. వైజయంతి మూవీస్ బ్యానర్ పై నాగ అశ్విన్ దర్శకత్వంలో ప్రభాస్ ‘ప్రాజెక్ట్ కె’ అనే చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. సైన్స్ ఫిక్షన్ కథగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో ప్రభాస్ సరసన బాలీవుడ్ బ్యూటీ దీపికా పడుకొనే నటిస్తుండగా.. బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ కీలక పాత్రలో నటిస్తున్నారు.
ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ చిత్రం త్వరలోనే షూటింగ్ ని మొదలుపెట్టనుంది. ఇక ఈ నేపథ్యంలోనే వైజయంతి మూవీస్ వారు క్యాస్టింగ్ కాల్ ఆఫర్ ఇచ్చారు. హైదరాబాద్ లో నివసించే వారికి మాత్రమే ఈ అవకాశం.. 50 నుంచి 70 ఏళ్ల వయసున్న స్త్రీ పురుషులు ఈ ఆడిషన్స్ కి అటెండ్ కావొచ్చు.. ఇంట్రెస్ట్ ఉన్నవారు తమ ఆడిషన్స్ వీడియోస్ ని మెయిల్ చేయమని వైజయంతి మూవీస్ వారు ట్విట్టర్ వేదికగా తెలిపారు. అయితే ఈ ఆడిషన్స్ ఎక్కడ నిర్వహిస్తుంది అనేది మాత్రం చెప్పలేదు. ఆసక్తి ఉన్నవారు ఆలస్యం చేయకుండా ప్రొఫైల్ పంపించేయండి.. ప్రభాస్ తో నటించే ఛాన్స్ కొట్టేయండి..
Also Read
తాజావార్తలు
ట్రెండింగ్
-
Abishek Porel Arrest: అత్యాచారం, బెదిరింపులు.. ఐపీఎల్ స్టార్ అరెస్ట్!
-
Gold Rate Today: బంగారం, వెండి ధరలకు రెక్కలు.. ఏకంగా రూ.10 వేలు!
-
Tulsi Plant Care Tips: వర్షాకాలంలో తులసి మొక్క గుబురుగా, పచ్చగా పెరగాలా.. సింపుల్గా ఈ చిట్కాలను ఫాలో అవ్వండి చాలు.!
-
Virat Kohli Bowler: బెస్ట్ బౌలర్గా విరాట్ కోహ్లీ.. షాక్ అవుతున్న క్రికెట్ ఫాన్స్!
-
YouTube Monetization Rules 2027: కొత్త యూట్యూబర్లకు బిగ్ షాక్.. మోనిటైజేషన్ నిబంధనలను రెట్టింపు చేసిన యూట్యూబ్..