మెగాస్టార్ చిరంజీవి మాస్ అవతారంలోకి మారి చేస్తున్న సినిమా ‘వాల్తేరు వీరయ్య’. బాబీ డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీ సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకి రానుంది. సంక్రాంతికి సినిమా రిలీజ్ ని అనౌన్స్ చేశారు కానీ ప్రమోషన్స్ మాత్రం పెద్దగా చెయ్యట్లేదు అని మెగా ఫాన్స్ కాస్త డిజప్పాయింట్ అవుతున్నారు. రిలీజ్ డేట్ దగ్గర పడుతుండడంతో మైత్రి మూవీ మేకర్స్ ‘వాల్తేరు వీరయ్య’ ప్రమోషన్స్ విషయంలో స్పీడ్ పెంచడానికి రెడీ అయ్యారు. మెగా అభిమానులకే కాదు మొత్తం సినీ అభిమనలకే జోష్ తెచ్చేలా, ‘వాల్తేరు వీరయ్య’ నుంచి ‘మాస్ మహారాజ రవితేజ’ టీజర్ ని రిలీజ్ చేయడానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. డిసెంబర్ 9న రవితేజ పాత్రకి సంబంధించిన టీజర్ ని రిలీజ్ చేసి, ‘వాల్తేరు వీరయ్య’ ప్రమోషన్స్ ని కిక్ స్టార్ట్ చేయనున్నారు.
‘వాల్తేరు వీరయ్య’ సినిమాలో రవితేజ స్పెషల్ రోల్ ప్లే చేశాడు. చిరు, రవితేజల మధ్య వచ్చే సీన్స్ కూడా సూపర్ గా వచ్చాయాని సమాచారం. రవితేజ టీజర్ కన్నా ముందే ‘వాల్తేరు వీరయ్య’ రిలీజ్ డేట్ ని రిలీజ్ డేట్ బయటకి రానుంది. రిలీజ్ డేట్ ని అనౌన్స్ చేసి, మెగాస్టార్ ఏ రోజు ఆడియన్స్ ముందుకి వస్తాడు అనే విషయంలో అందరికీ ఒక క్లారిటీ ఇవ్వాలని మేకర్స్ డిసైడ్ అయినట్లు ఉన్నారు. డిసెంబర్ 8న ‘వాల్తేరు వీరయ్య’ రిలీజ్ డేట్ ని అఫీషియల్ గా అనౌన్స్ చేయనున్నారు. ఇప్పటికే సంక్రాంతి బరిలో ఉన్న ‘వీర సింహా రెడ్డి’, ‘వారసుడు’ సినిమాలు జనవరి 12న ప్రేక్షకుల ముందుకి వస్తున్నట్లు అనౌన్స్ చేసేశారు. మరి చిరు, ఈ రెండు సినిమాల కన్నా ముందొస్తాడా? లేక వెనకొస్తాడా? అనేది చూడాలి.