మెగా స్టార్ చిరంజీవి, మాస్ మహారాజా రవితేజ కలిసి నటిస్తున్న సినిమా ‘వాల్తేరు వీరయ్య’. జనవరి 13న ఆడియన్స్ ముందుకి రానున్న ఈ మూవీ ప్రమోషన్స్ ఫైనల్ లెగ్ లోకి చేరాయి. జనవరి 8న వాల్తేరు వీరయ్య ప్రీరిలీజ్ ఈవెంట్ గ్రాండ్ గా జరగనుంది, వైజాగ్ లో జరగనున్న ఈ ఈవెంట్ లో మూవీ ట్రైలర్ ని రిలీజ్ చేస్తారని మెగా అభిమానులు ఈగర్ గా వెయిట్ చేశారు. ఫాన్స్ లో జోష్ పెంచుతూ, వాల్తేరు వీరయ్య ప్రమోషన్స్ కి కిక్ ఇస్తూ ట్రైలర్ ని ప్రీరిలీజ్ ఈవెంట్ కన్నా ముందే రిలీజ్ చేస్తున్నట్లు మైత్రీ మూవీ మేకర్స్ అనౌన్స్ చేశారు. ఈరోజు సాయంత్రం 6:03 నిమిషాలకి వాల్తేరు వీరయ్య ట్రైలర్ బయటకి రాబోతోంది. టైం సెట్ చేసుకోని రెడీగా ఉంటే వీరయ్య ట్రైలర్ తో వచ్చి సోషల్ మీడియాని రఫ్ఫాడించడానికి సిద్ధంగా ఉన్నాడు.
మెగా అభిమాని అయిన దర్శకుడు బాబీ, చిరు ఫాన్స్ కి పూనకలు తెప్పించే రేంజులో ట్రైలర్ కట్ చేసాడని సమాచారం. ట్రైలర్ లో చిరు కామెడీ టైమింగ్ తో పాటు చిరు-రవితేజల మధ్య సీన్ కి కూడా చూపించబోతున్నారట. వీరయ్య టైటిల్ సాంగ్ ని బ్యాక్ గ్రౌండ్ గా ట్రైలర్ లో అక్కడక్కడా వినిపించనున్నారని టాక్. ప్రీరిలీజ్ ఈవెంట్ కన్నా ముందే ట్రైలర్ వస్తుండడంతో, ఈరోజు ఉదయం నుంచి రేపు ఈవెంట్ అయ్యే వరకూ సోషల్ మీడియాలో #WaltairVeerayyaTrailer మరియు #WaltairVeerayya అనే హాష్ ట్యాగ్స్ ట్రెండ్ అవుతూ ఉంటాయి. చాలా రోజుల తర్వాత చిరు నుంచి ఒక కంప్లీట్ మాస్ మసాలా సినిమా ‘వాల్తేరు వీరయ్య’ రూపంలో ఆడియన్స్ ముందుకి రానుంది. ఈ సినిమాతో చిరు హిట్ ట్రాక్ ఎక్కడమే కాకుండా సినిమా చూసిన ప్రతి ఒక్కరికీ వింటేజ్ చిరుని గుర్తు చేస్తాడని చిత్ర యూనిట్ కాన్ఫిడెంట్ గా ఉన్నారు.