Jawan: షారుఖ్ ఫాన్స్ జోష్ లోకి వచ్చారు… దెబ్బకి ట్విట్టర్ షేక్ అయ్యింది
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సరిగ్గా అయిదు నెలల క్రితం వరకూ షారుఖ్ ఖాన్ అన్నా, షారుఖ్ ఫాన్స్ అన్నా బాలీవుడ్ లో పెద్దగా సౌండ్ ఉండేది కాదు. పదేళ్లుగా హిట్ లేకపోవడం, అయిదేళ్లుగా సినిమానే లేకపోవడం ఇందుకు కారణం. ఒకప్పుడు ఫేస్ ఆఫ్ ఇండియన్ సినిమాగా, కింగ్ అఫ్ బాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీగా ఉన్న షారుఖ్ ఖాన్ సడన్ గా ఫ్లాప్స్ స్ట్రీక్ లోకి వెళ్లిపోవడంతో ఫాన్స్ అంతా సైలెంట్ అయిపోయారు. ఇక షారుఖ్ టైం అయిపొయింది అనే మాట హిందీ ఫిల్మ్ ఇండస్ట్రీ మొత్తం స్ప్రెడ్ అయ్యింది. ఆ మాట నిజమేనేమో, ఇక షారుఖ్ ఖాన్ బాలీవుడ్ కింగ్ కాదేమో అని అంతా అనుకుంటున్న సమయంలో వచ్చింది ‘పఠాన్’ సినిమా. యష్ రాజ్ ఫిల్మ్ ప్రొడక్షన్ నుంచి వచ్చిన ఈ మూవీ షారుఖ్ ఖాన్ ని మళ్లీ కంబ్యాక్ ఇచ్చేలా చేసింది. బాలీవుడ్ ఇప్పటివరకూ చూడని రేంజ్ కంబ్యాక్ ని ఇచ్చిన షారుఖ్ ఖాన్ పఠాన్ సినిమాతో వెయ్యి కోట్ల హీరో అయ్యాడు. బాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర ఉన్న అన్ని రికార్డులని బ్రేక్ చేస్తూ పఠాన్ సినిమా షారుఖ్ ఖాన్ ని మళ్లీ టాప్ 1 ప్లేస్ లో కూర్చోబెట్టింది, షారుఖ్ ఖాన్ ఫాన్స్ ని కూడా లైం లైట్ లోకి తీసుకోని వచ్చింది. ఈ హిట్ తో షారుఖ్ ఫాన్స్ సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ అయ్యారు.
కింగ్ ఖాన్ కి సంబంధించిన ఏ అప్డేట్ వచ్చినా దాన్ని నేషనల్ వైడ్ ట్రెండ్ చేస్తున్నారు. పఠాన్ తర్వాత షారుఖ్ ఖాన్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘జవాన్’. సౌత్ స్టార్ డైరెక్టర్ అట్లీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ మూవీ అప్డేట్ కావాలి అంటూ షారుఖ్ ఖాన్ ఫాన్స్ సోషల్ మీడియాలో ట్రెండ్ చేస్తున్నారు. “WAITING FOR JAWAN UPDATES” అనే ట్యాగ్ ని క్రియేట్ చేసి దర్శకుడిని, షారుఖ్ ని ట్యాగ్ చేసి ట్వీట్స్ చేస్తున్నారు. జూన్ నెలలో జవాన్ సినిమా రిలీజ్ కి షెడ్యూల్ అయ్యి ఉంది. షూటింగ్ కూడా కంప్లీట్ చేసుకున్న ఈ మూవీ నుంచి ఇప్పటివరకూ కనీసం ఒక్క పోస్టర్ కూడా బయటకి రాలేదు. దీంతో రెండు నెలల్లో రిలీజ్ ఉంటే ప్రమోషన్స్ చెయ్యట్లేదు ఏంటని షారుఖ్ ఖాన్ ఫాన్స్ అప్సెట్ అవుతున్నారు. మరి అభిమానుల వెయిటింగ్ కి ఎండ్ కార్డ్ వేస్తూ అట్లీ జవాన్ నుంచి ఎలాంటి అప్డేట్ ని దించుతాడో చూడాలి.
Also Read
- Saiyaara Jodi : మళ్లీ జోడీ కడుతున్న బాలీవుడ్ బ్లాక్ బస్టర్ 'సైయారా' జోడి
- Raaka Glimpse: డిసెంబర్లోనే అసలైన గ్లింప్స్.. రేపు అల్లు అర్జున్ ‘రాకా’ నుంచి వచ్చే సర్ప్రైజ్ ఇదేనా?
- Dhanush : సితార ఎంటర్టైన్మెంట్స్లో 'లబ్బర్ పండు' దర్శకుడితో ధనుష్
- Nani Next Movies: ‘ది ప్యారడైజ్’ తర్వాత నాని వరుస సినిమాలు.. 2027లో ఏకంగా మూడు కొత్త ప్రాజెక్టులు!
తాజావార్తలు
-
B35 Bullet Train: 2030 నాటికి భారత్ 350KM వేగంతో బుల్లెట్ ట్రైన్.. జపాన్ E10 సిరీస్కు పోటీగా స్వదేశీ B35
-
Karivepaku Kaaram Podi: ముద్దగ కాకుండా.. పొడిపొడిగా, పర్ఫెక్ట్గా “కరివేపాకు కారప్పొడి” కావాలా.? ఇంకెందుకు ఆలస్యం ఇలా ఫాలో అవ్వండంతే..!
-
Saiyaara Jodi : మళ్లీ జోడీ కడుతున్న బాలీవుడ్ బ్లాక్ బస్టర్ ‘సైయారా’ జోడి
-
Raaka Glimpse: డిసెంబర్లోనే అసలైన గ్లింప్స్.. రేపు అల్లు అర్జున్ ‘రాకా’ నుంచి వచ్చే సర్ప్రైజ్ ఇదేనా?
-
India Matches: 3 నెలలు, 28 మ్యాచ్లు.. టీమిండియా బిజీ షెడ్యూల్ మాములుగా లేదుగా..!
ట్రెండింగ్
-
11,000mAh బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్, 108MP కెమెరాతో వచ్చేస్తున్న Honor X9e ప్రో..!
-
Curd in Fridge: ఫ్రిజ్లో పెరుగు పెట్టారా? ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు తినొద్దు..
-
Pat Cummins: కోహ్లీ, రోహిత్ కాదు.. అతడే వెరీ టఫ్.. వికెట్ ఇవ్వకుండా విసిగించేవాడు!
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!
-
iPhone 18 India Sales: ఐఫోన్ 18 కోసం 12 గంటల పాటు స్టోర్ల వద్ద క్యూ.. తొలి రోజే రికార్డ్ స్థాయి అమ్మకాలు..!