Vishwak Sen: మాస్ కా దాస్ విశ్వక్ సేన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. విభిన్నమైన కథలతో కాదు.. కొత్త కొత్త టైటిల్స్ తోనే అభిమానులను ఆకర్షిస్తూ ఉంటాడు. పాగల్, ధమ్కీ, అశోకవనంలో అర్జున కళ్యాణం లాంటి సినిమాలే అందుకు నిదర్శనం. ఇక ఈసారి కూడా మరో సరికొత్త టైటిల్ లో అభిమానులను అలరించనున్నాడు. ప్రస్తుతం విశ్వక్ సేన్, అంజలి జంటగా లిరిసిస్ట్ కృష్ణ చైతన్య దర్శకత్వంలో VS11 సినిమా చేస్తున్న విషయం తెల్సిందే. సితార ఎంటర్ టైన్మెంట్స్, శ్రీకర స్టూడియోస్ బ్యానర్స్ పై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్నారు. ఇకపోతే ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రంపై అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. ఇప్పటికే విశ్వక్ సేన్ ఊర మాస్ లుక్ లో అదరగొట్టగా.. రెండు రోజుల క్రితమే అంజలి లుక్ ను మేకర్స్ రిలీజ్ చేశారు. ఇందులో అంజలి రత్నమాల అనే పాత్రలో నటిస్తున్నట్లు మేకర్స్ తెలిపారు.
Spy Release Date: నిఖిల్ చేత కూడా చెప్పించేశారు.. 29నే వరల్డ్ వైడ్ రిలీజ్
తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఒక వార్త నెట్టింట వైరల్ గా మారింది. అదేంటంటే.. ఈ సినిమాకు లంకల రత్న అనే టైటిల్ ను ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది. అంజలి పేరు రత్నమాల కావడంతో.. ఆమెకు ఈ చిత్రంలో మంచి గుర్తింపు వస్తుందని అంటున్నారు. ఇక లంకల రత్న ఎవరు..? విశ్వక్ పేరు అదేనా..? లేక అంజలి వెనుక ఉండి విశ్వక్ కథను నడిపిస్తున్నాడా..? అనేది తెలియాల్సి ఉంది. విలేజ్ బ్యాక్ డ్రాప్ లో ఈ సినిమా రానుంది. ఇక అందుతున్న సమాచారం ప్రకారం విశ్వక్.. ఈ చిత్రంలో ఊర మాస్ అవతారంలో కనిపించనున్నాడట. మాస్ కే దాస్ బ్రాండ్ .. ఇక ఈ సినిమాలో ఊర మాస్ అనేసరికి అభిమానుల్లో హైప్ పెరిగిపోయింది. మరి ఈ సినిమాతో దాస్ గాడు ఎలాంటి హిట్ అందుకుంటాడో చూడాలి.