Vishwak Sen: మాస్ కా దాస్ విశ్వక్ సేన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. విభిన్నమైన కథలతో కాదు.. కొత్త కొత్త టైటిల్స్ తోనే అభిమానులను ఆకర్షిస్తూ ఉంటాడు. పాగల్, ధమ్కీ, అశోకవనంలో అర్జున కళ్యాణం లాంటి సినిమాలే అందుకు నిదర్శనం. ఇక ఈసారి కూడా మరో సరికొత్త టైటిల్ లో అభిమానులను అలరించనున్నాడు.