Vishwak Sen: మాస్ కా దాస్ కొత్త సినిమాపై ఇంట్రెస్టింగ్ బజ్.. ఆ డైరెక్టర్‌తో విశ్వక్ మూవీ!

Vishwaksen

Vishwaksen

Vishwak Sen: మాస్ కా దాస్ విశ్వక్ సేన్ ప్రస్తుతం వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. విభిన్న కథలను ఎంచుకుంటూ తనకంటూ యూత్‌లో ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఈ యువ హీరో.. ఇప్పుడు మరో ఆసక్తికరమైన కాంబినేషన్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు టాలీవుడ్ వర్గాల్లో జోరుగా ప్రచారం జరుగుతోంది. తాజా బజ్ ప్రకారం.. ’35 చిన్న కథ కాదు’ చిత్రంతో ప్రశంసలు అందుకున్న డైరెక్టర్ నంద కిషోర్ డైరెక్షన్‌లో విశ్వక్ హీరోగా ఓ కొత్త సినిమా తెరకెక్కనుందట. ఈ చిత్రాన్ని నిర్మాత ధీరజ్ మొగిలినేని నిర్మించనున్నట్లు సమాచారం.

ఇప్పటికే ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన ప్రాథమిక చర్చలు పూర్తయ్యాయని, త్వరలోనే అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉందని సినీ వర్గాలు చెబుతున్నాయి. అంతేకాదు, ప్రకటన అనంతరం ఆలస్యం చేయకుండా రెగ్యులర్ షూటింగ్ కూడా ప్రారంభించనున్నట్లు టాక్ వినిపిస్తోంది. విశ్వక్ సేన్ ఇమేజ్‌కు తగ్గట్టే వినోదంతో పాటు బలమైన స్టోరీతో ఈ సినిమా తెరకెక్కించనున్నట్లు సమాచారం. అయితే నటీనటులు, సాంకేతిక బృందం, ఇతర వివరాలు అధికారిక ప్రకటనతోనే వెల్లడికానున్నాయి. ప్రస్తుతం విశ్వక్ సేన్ స్వీయ దర్శకత్వంలో ‘కల్ట్’ (#Cult) అనే సరికొత్త స్లాషర్ థ్రిల్లర్ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాకు తరుణ్ భాస్కర్ డైలాగ్స్ రాస్తుండగా, రవి బస్రూర్ సంగీతాన్ని అందిస్తున్నారు.