VS11:ఈ ఏడాది దాస్ కా ధమ్కీ అంటూ ప్రేక్షకుల ముందుకు వచ్చాడు విశ్వక్ సేన్. ఈ సినిమా విశ్వక్ కు ఆశించిన ఫలితాన్ని అందించలేకపోయింది. దీంతో ఎలాగైనా ఈసారి హిట్ అందుకోవాలని విశ్వక్ గట్టి ప్రయత్నాలు చేస్తున్నాడు. ఈ నేపథ్యంలోనే లిరిసిస్ట్ కృష్ణ చైతన్య దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నాడు. సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్స్ పై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. VS11 అనే వర్కింగ్ టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో అంజలి హీరోయిన్ గా నటిస్తుంది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజ్ అయిన పోస్టర్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి.
Ram Charan: ఇండస్ట్రీకి మీరే నిజమైన గేమ్ ఛేంజర్.. చరణ్ ట్వీట్ వైరల్
ఇక పీరియాడిక్ పొలిటికల్ టచ్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాకు సంబంధించిన టైటిల్ ను రేపు ఉదయం రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ తెలిపారు. అయితే అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమాకు గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి అని టైటిల్ ఫిక్స్ చేశారట. అంతకుముందు ఇదే సినిమాకు లంకల రత్న అని టైటిల్ ను అనుకున్నారు. అయితే దానికన్న గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి అనే టైటిల్ సినిమాకు చాలా యాప్ట్ గా ఉంటుందని భావించిన చిత్ర బృందం ఇదే టైటిల్ ను ఖరారు చేసినట్లు తెలుస్తుంది. ఇక ఈ సినిమాపై అభిమానులు చాలా ఆశలు పెట్టుకున్నారు. మాస్ కా దాస్ విశ్వక్ ఫస్ట్ లుక్ పోస్టర్ ఊర మాస్ గా ఉండడంతో సినిమా మొత్తం యాక్షన్ పో తో నింపేశారని తెలుస్తుంది. మరి ఈ సినిమాతో విశ్వక్ ఎలాంటి హిట్ ను అందుకుంటాడో చూడాలి.