Vishwak Sen Emotional Words About Balakrishna : గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి ప్రీ రిలీజ్ ఈవెంట్ లో విశ్వక్సేన్ మాట్లాడుతూ ముందుగా నందమూరి బాలకృష్ణకి ధన్యవాదాలు తెలిపారు. మీ అందరికీ ఒక ఇన్సిడెంట్ చెబుతాను ఈ సినిమా షూటింగ్ అప్పుడు జరిగిన విషయం మీ ముందుకు తీసుకొస్తున్నాను. నేను ఈ సినిమాకి ఫైట్ ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు లారీ మీద నుంచి కిందకి పడిపోయా, మోకాలికి దెబ్బ తగిలింది. ఆల్మోస్ట్ మోకాలు చిప్ప విరిగిపోయింది. రెండేళ్లు మంచానికే పరిమితం అవ్వాలి అనుకున్నాను. అయితే దేవుడి దయవల్ల ఏమీ జరగలేదు. ఇంతమంది బ్లెస్సింగ్ అండ్ లవ్ అనుకుంటా, నిజంగా నేను షాక్ అయ్యాను. ఆ సమయంలో నాకు ఏమైందో అని చాలామంది వాకబు చేశారు. చాలామంది ఆరోగ్యం బాగుండాలని కోరుకున్నారు. అయితే నందమూరి బాలకృష్ణ గారు నాకు ఫోన్ చేసి 15 నిమిషాల పాటు నా ఆరోగ్యం గురించి మాట్లాడుతున్నారు. అప్పుడు ఫోన్ లో కనిపించలేదు కానీ నేను ఆయనతో మాట్లాడుతున్నప్పుడు ఏడ్చాను.. ఆయన గొంతులో ఎప్పుడూ ఒక గాంబీర్యం ఉంటుంది కానీ నేను పడిపోయాను అని తెలిసి ఆయన ఎక్కువ బాధపడ్డారు.
నీ గురించి చాలా బాధపడుతున్నాను అని ఆయన అంటుంటే వెంటనే ఏడ్చేశాను, అలా కొన్నేళ్ల తర్వాత నన్ను ఆయన ఏడిపించేశారు. నిజానికి కుటుంబ సభ్యుల తర్వాత అంత ప్రేమ చూపించే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. నాకు బాలకృష్ణ గారి ఆ వాత్సల్యం దక్కింది. ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ చాలా పెద్ద థ్యాంక్స్. నాకు ఎక్కడి నుంచి మొదలు పెట్టాలో అర్థం కావడం లేదు కానీ ఈరోజు నందమూరి తారక రామారావు గారి 13వ జయంతి సందర్భంగా జోహార్ ఎన్టీఆర్ అని మొదలు పెడుతున్నాను. నిజానికి అన్నగారి పోస్టర్ తోనే మా సినిమా ప్రయాణం, ఇదే జయంతి రోజున మొదలైంది. ఇప్పుడు ఇదే రోజు ప్రీ రిలీజ్ ఈవెంట్ జరుగుతోంది. నిన్న రాత్రి ఐదేళ్లలో ఏం జరిగింది అని ఆలోచిస్తుంటే సరిగ్గా మార్చి 31వ తేదీనే ఫలక్నామా దాస్ రిలీజ్ అయింది. నేను ఇక్కడ నిలుచున్నాను అన్నా నా ఐదేళ్లు నోట్లోకి వెళుతున్నాయి అన్నా నాకు ఏం జరిగిందన్న ఫలక్నామా దాస్ అనే సినిమా నేను రిస్క్ తీసుకుని, మా నాన్న రిస్క్ తీసుకుని, నా స్నేహితులు రిస్క్ తీసుకుని ఆ సినిమా తీసినందుకే. ఆ సినిమాని ఆదరించిన ప్రేక్షకుల వల్లనే. అర్థం కాకుండానే ఐదు సంవత్సరాలు అయిపోయింది.
ఐదు సంవత్సరాలు నన్ను సపోర్ట్ చేసిన ఇండస్ట్రీకి, డైరెక్టర్లకి ప్రొడ్యూసర్లకి అందరికీ థాంక్యూ సో మచ్, ముఖ్యంగా ఫ్యాన్స్ కి. చాలాసార్లు జీవితంలో ఇబ్బందికర పరిస్థితులు వచ్చాయి. అలాంటప్పుడు కూడా మనకి ఎదురు ఉన్నవాళ్లకి బ్యాండ్ భజాయించింది మీరే. మీ వల్లనే నిలబడ్డాను. ఐదు సంవత్సరాలు అయింది ఇప్పుడు చెబుతున్నాను నెక్స్ట్ ఐదు సంవత్సరాలలో ఫైరే కాల్చిపడేస్తా మొత్తం అని అన్నారు. ఇక మా డైరెక్టర్ కి నాకు ఒకరినొకరు పొగుడుకోవడం ఇష్టం ఉండదు కానీ నన్ను ఎలా ఊహించుకున్నాడో కానీ నాకు ఎప్పటినుంచో ఎదురుచూస్తున్న ఒక పాత్ర దొరికినట్లు అయింది. వెంటనే వంశీ అన్నకి ఫోన్ చేసి నువ్వు నేను ఎదుగుతున్న కత్తి దొరికేసింది అది దింపుదామని చెప్పి రెడీ చేసిన కత్తి ఈ గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి. మా ఈ సినిమా కొత్త అప్రోచ్ తో వస్తున్న ఒక కమర్షియల్ సినిమా. బాలకృష్ణ గారు నాకు ఫోన్ చేసి ఇచ్చిన బెస్ట్ కాంప్లిమెంట్ ఇది కొత్త సీసాలో ఉన్న పాత వైన్ అన్నారు. ఇదే ఆ కొత్త సీసా. నాగ వంశీ గారికి థాంక్యూ సో మచ్. రెండు మూడు సినిమాలు చేయడానికి రెడీ అయి కూడా చివరికి ఇది ఫిక్స్ అయ్యాం. ఎగ్జయిట్మెంట్ తగ్గిపోగానే మొదటి రెండు సినిమాలు ఆపేసాం, కానీ వెయిట్ చేసినందుకు చాలా చాలా థాంక్స్, నేను పని చేసిన తొమ్మిది సినిమాల బ్యానర్లలో ఇది బెస్ట్ బ్యానర్. నాగ వంశీ గారు నేను పనిచేసిన అందరిలో బెస్ట్ ప్రొడ్యూసర్. మా కో ప్రొడ్యూసర్స్ వెంకట్, గోపీచంద్ కూడా మొదటి రోజు నుంచి చాలా సహకరిస్తూ వచ్చారు..
నన్ను చైతన్యని భరించినందుకు థాంక్యూ సార్. మా నటీనటులు ఆనంద్ గారు మధుగారు అలాగే మా గ్యాంగ్ అందరు, ఆపోజిట్ గ్యాంగ్ అందరు అద్భుతంగా నటించారు. నేను ఈ సినిమా అయిపోయిందని మొన్న రియలైజ్ అయ్యి రత్నాకి ఉన్నట్టే నేను కూడా చెవికి పోగి కుట్టించుకున్నాను. నాకు రత్న అనే వాడు నా జీవితంలో ఉండిపోవాలని కుట్టించుకున్నాను, 31 మార్నింగ్ వేటాడటమే. చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నాము. చాలా మంచి సినిమా తీశాం, చాలా నిజాయితీగా పని చేశాం. కచ్చితంగా మే 31న థియేటర్ కి ఫ్యామిలీ మొత్తం కలిసి రావచ్చు సెన్సార్ కూడా యు బై ఏ సర్టిఫికెట్ వచ్చింది. వైలెన్స్ కూడా కావాలని పెట్టింది కాదు ఒక కారణంతోనే ఉంటుంది. రత్న అనే వాడు ఏడిపిస్తాడు, నవ్విస్తాడు, తిట్టించుకుంటాడు కానీ చివరికి మీతో పాటు ఇంటికి వస్తాడు. చూసిన రెండు మూడు రోజులపాటు వెంటాడుతూనే ఉంటాడు.
యువన్ శంకర్ రాజా గారి అభిమానిగా పెరిగాను, ఆయనతో సినిమా చేస్తున్నానని తెలిసి ఆనందపడ్డాను. నేను కూడా బ్యాగ్రౌండ్ స్కోర్ గురించి కొంచెం ప్రెషర్ చేసి ఉంటాను నన్ను క్షమించండి. మా కథానాయకుల గురించి చెప్పాలంటే ముందు రత్నమాలనే క్యారెక్టర్ చెప్పినప్పుడు ఈ క్యారెక్టర్ అంజలి చేయాలని ఒక నిమిషం కూడా గ్యాప్ తీసుకోకుండా చెప్పేశాను. ఒక తమిళ్ సినిమా చూసి ఈమెతో ఎప్పటికైనా పని చేయాలనుకున్నాను. అది ఈ సినిమాతోనే కుదిరింది. ఈ పాత్రకి నువ్వు తప్ప ఎవరు న్యాయం చేయలేరు అంజలి. నేహా నువ్వు ఈ సినిమా తర్వాత ఎన్ని సినిమాలు అయినా చేయి ఇప్పటివరకు నిన్ను రాధిక అంటున్నారు కానీ ఇకమీదట బుజ్జి అని గుర్తుపెట్టుకుంటారు. రమ్యకృష్ణ గారి నీలాంబరి క్యారెక్టర్ లాగా ఈ సినిమాలో నీ క్యారెక్టర్ ని గుర్తు పెట్టుకుంటారు. 31 న ధియేటర్లకు రండి అని కామెంట్ చేశారు.