Kannappa : మంచు డ్రీమ్ ప్రాజెక్ట్ ‘కన్నప్ప’ మూవీ ప్రమోషన్లు జోరుగా సాగుతున్నాయి. జూన్ 27న రిలీజ్ అవుతున్న సందర్భంగా విష్ణు వరుసగా ఇంటర్వ్యూలు ఇస్తున్నాడు. అయితే ఈ సినిమాలో ఆయన కూతుర్లు అయిన అరియానా, వివియానా కూడా నటిస్తున్న సంగతి తెలిసిందే. వీరిద్దరిపై షూట్ చేసిన ‘జనులారా వినరారా శ్రీకాళహస్తి గాథ’ పాట లిరిక్స్ ప్రోమోను తాజాగా రిలీజ్ చేశారు. ఇంకో విశేషం ఏంటంటే ఈ పాటను కూడా వారిద్దరే పాడారు. ఇందులో ఇద్దరి లుక్ బాగానే కనిపిస్తోంది. త్వరలోనే పూర్తి సాంగ్ ను రిలీజ్ చేయబోతున్నారు.
Read Also : Puri Sethupathi: జూన్ నుంచి షూట్.. లొకేషన్స్ రెక్కీలో పూరి బిజీ
స్టీఫెన్ దేవస్సీ మ్యూజిక్ అందించారు. ముకేశ్ కుమార్‌సింగ్ డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో ప్రభాస్, కాజల్, అక్షయ్ కుమార్, మోహన్ లాల్ కీలక పాత్రలో నటించారు. ప్రభాస్ అందరికంటే ఎక్కువ సమయం ఇందులో కనిపించబోతున్నారు. ఇప్పటికే రిలీజ్ కావాల్సి ఉన్నా.. వీఎఫ్ ఎక్స్ పనుల కారణంగా మూవీ వాయిదా పడింది. అయితే మూవీ హార్డ్ డిస్క్ పోయిందంటూ ఈరోజు పోలీసులకు కంప్లయింట్ కూడా ఇచ్చారు.
దీనిపై మూవీ టీమ్ అధికారిక ప్రకటన కూడా చేసింది. త్వరలోనే అన్ని సర్దుకుంటాయని మూవీ టీమ్ నుంచి వివరణ వచ్చింది. ఈ సినిమా ప్రమోషన్లలో త్వరలోనే ప్రభాస్ పాల్గొంటారని కూడా చెబుతున్నారు. ప్రీ రిలీజ్ ఈవెంట్ ను కూడా భారీ ఎత్తున ప్లాన్ చేస్తున్నారు. అతి త్వరలోనే ట్రైలర్ ను కూడా రిలీజ్ చేసేందుకు భారీ ఎత్తున ప్లాన్ చేస్తున్నారు. అది వచ్చిన తర్వాత మరింత అంచనాలు పెరుగుతాయని మూవీ టీమ్ చెబుతోంది.
Read Also : Minister Seethakka: నిర్మల్ జిల్లా కలెక్టర్‌పై మంత్రి సీతక్క ఆగ్రహం..