తెలుగు ఫిల్మోగ్రఫీలో స్టార్ డైరెక్టర్‌గా చెక్కుచెదరని స్థానం సంపాదించుకున్నాడు దర్శకదీరుడు రాజమౌళి. ఆయన తెరకెక్కించిన ఇండస్ట్రీ బ్లాక్ బస్టర్ మూవీలో ‘ఈగ’ ఒకటి. ట్యాలెంట్ ఉంటే ఈగతో కూడా సినిమా తీయొచ్చు అని ప్రూఫ్ చేసి రికార్డు బద్దలు కొట్టాడు. అయితే ఈగ సీక్వెల్ కావాలని ఫ్యాన్స్ ఎప్పటి నుంచో డిమాండ్ చేస్తున్న, రాజమౌళి దీనిపై ఎప్పుడు ప్రస్తావించలేదు. ఇక ‘బాహుబలి’ తర్వాత ప్యాన్ ఇండియా మార్కెట్ అంతకంతా పెరిగిపోవడంతో వెనక్కి తిరిగి చూసుకోలేదు జక్కన్న. ఇక తాజాగా ఈగ మూవీ తరహా లో తమిళ తెలుగులో ‘లవ్లీ’ అనే సినిమా రాబోతోంది.
Also Read : Odela 2 : అక్కడ కూడా ‘ఓదెల 2’ను ప్రమోట్ చేయనున్న తమన్నా
మాథివ్ థామస్ హీరోగా దినేష్ కరుణాకరన్ దర్శకత్వంలో రూపొందిన ఈ మూవీ ఏప్రిల్ 4న విడుదల కాబోతుంది.తాజాగా ఈ మూవీ నుంచి టీజర్ రిలీజ్ చేయగా.. ఇందులో ఒక ఈగకు ఓ యువకుడితో స్నేహం కుదురుతుంది, అతనితో దోస్తీ చేసి ఎన్నో విషయాలు పంచుకుంటూ హీరోకు ఏదైనా సమస్య వస్తే సలహాలు ఇస్తూ, ఇబ్బందుల్లో పడితే ఆదుకుంటుంది ఈగ. అలా టీజర్ విజువల్ ఎఫెక్ట్స్ అన్నీ అచ్చం తెలుగు ‘ఈగ’ మూవీ లాగే దించేశారు. స్టోరీ ఎక్కువ కూడా రివీల్ కాకుండా టీజర్ చాలా జాగ్రత్తగా కట్ చేశారు. మరి వీళిద్దరి ఫ్రెండ్ షిప్‌లో విలన్ ఎవరు, హీరోయిన్ ఎక్కడుంది లాంటి ప్రశ్నలకు సమాధానం తెలియాలి అంటే మూవీ చూడాల్సిందే. అయితే తెలుగుతో పాటు మొత్తం నాలుగు భాషల్లో రిలీజ్ చేయబోతున్నారు.