బెట్టింగ్ యాప్ కేసులో దర్యాప్తులో విచారణను వేగవంతం చేసారు పోలీసులు. ఈ బెట్టింగ్ యాప్స్ ను ప్రమోట్ చేసిన వెండితెర, బుల్లితెర నటీనటులపై కేసులు నమోదు చేసిన సంగతి తెలిసింది. కాగా ఈ కేసు వ్యవహారమై బుల్లితెర యాంకర్ విష్ణుప్రియకు విచారణకు రావలసిందిగా పోలీసులు నోటీసులు అందించారు. మొదటి సారి విచారణకు హాజరయిన విష్ణు ప్రియా నుండి పలు కీలక విషయాలు రాబట్టారు పోలీసులు. అనంతరం ఆమె స్టేట్మెంట్ రికార్డు చేసి సెల్ ఫోన్ ను సీజ్ చేశారు.
Also Read : Bollywood : హిట్ సినిమా సీక్వెల్ తో డైరెక్టర్ మారుతున్న హృతిక్ రోషన్
అయితే ఇటీవల మరోసారి విచారణకు రావలసిందిగా విష్ణుప్రియకు నోటీసులు అందించగా హైకోర్టును ఆశ్రయించింది విష్ణు ప్రియ.
బెట్టింగ్ యాప్స్ కేసులో తనపై నమోదైన రెండు FIR లను క్వాష్ చేయాలంటూ హైకోర్టులో పిటిషన్ వేసింది. క్వాష్ పిటిషన్ విచారించిన హైకోర్టు విష్ణుప్రియ పిటిషన్ ను కొట్టేసింది. అలాగే పోలీసుల విచారణకు సహకరించాలంటూ ఆదేశాలు జారీ చేసింది హైకోర్టు.
ఈ నేపధ్యంలో బెట్టింగ్ యాప్ కేసులో నేడు పంజాగుట్ట పోలీసుల ముందుకు మరోసారి నటి విష్ణు ప్రియ విచారనకు హాజరుకానుంది. ఈనెల 25న విచారణకు హాజరు కావాలంటూ గతంలోనే చెప్పిన పంజాగుట్ట పోలీసులు. హైకోర్టు ఆదేశాల నేపథ్యంలో ఇవాళ పంజాగుట్ట పోలీసుల ముందుకు విచారణకు రానుంది విష్ణు ప్రియ. బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్, ఆర్ధిక లావాదేవీలపై విష్ణుప్రియను నేడు మరోసారి ప్రశ్నించనున్నారు పంజాగుట్ట పోలీసులు. అలాగే రానున్న రోజుల్లో మరికొందరని విచారించి మరిన్ని విషయాలను రాబట్టానున్నారు. ఈ కేసులో ఎంతటి వారిఉన్న ఉపేక్షించేది లేదని ఇదివరకే ప్రకటించారు పోలీసులు.